ఇటీవలి కాలం లో మహిళలపై ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయి . మహిళలపై జరుగుతున్నా  అరాచకాలను ఎలాగైనా  పూర్తిస్థాయిలో నిర్మూలించేందుకు సీఎం కేసీఆర్ ప్రణాళిక ను అమలుచేసే దిశగా అడుగులు వేస్తున్నారు అని  పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడారు . ప్రతి గ్రామంలో షీ టీం లను ఏర్పాటుచేయాలని భావిస్తున్నారని తెలిపారు. గురువారం రాజేంద్రనగర్‌లోని ఎన్‌ఐఆర్డీలో జరిగిన స్త్రీనిధి ఎనిమిదో వార్షిక సర్వసభ్య సమావేశంలో అయన  మాట్లాడుతూ.. ఇక త్వరలో నే  మహిళల జోలికి రావడానికి భయపడాల్సిన పరిస్థితులు వస్తాయన్నారు.

 

ముఖ్యమంత్రి   దీనికోసం తనతోపాటు హోంమంత్రి మహమూద్ అలీ, మహిళా, శిశు సంక్షేమశాఖ మం త్రి సత్యవతిరాథోడ్‌తో కలిపి కమిటీ వేశారని వెల్లడించారు . మహిళా సంఘాల సభ్యులతోనే ఈ  టీంలు ఉంటాయని, వారి ఆధ్వర్యంలోనే ఇవి పనిచేస్తాయని వెల్లడించారు . చెడుతిరుగుళ్లు తిరుగుతూ ఉండేవారిని  , తాగుబోతులు, మహిళలపై అరాచకాలకు పాల్పడేవారిని మహిళాసంఘాలు గుర్తించి,  వారిపై పోలీసులకు రిపోర్టుచేసేలా పూర్తి స్వేచ్ఛ కల్పిస్తామని తెలిపారు.

 

ఎలాంటి చిన్న అఘాయిత్యం జరిగినా వారిపై మహిళాసంఘాలే చర్యలు తీసుకునేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు అయన వెల్లడించారు .ఫిర్యాదులపై సత్వర చర్యలు తీసుకొని మహిళల రక్షణకు షీటీంల పనితీరును మరింత బలోపేతం చేయనున్నట్టు మహిళా రక్షణ విభాగం ఐజీ స్వాతిలక్రా తెలిపారు. అన్ని జిల్లాల్లోని షీటీమ్స్‌కు ఎప్పటికప్పుడు శిక్షణ ఇవ్వడం, ఫిర్యాదులపై పరిమిత సమయంలో చర్యలు తీసుకునే విషయాన్ని పర్యవేక్షించేందుకు రాష్ట్రస్థాయి నోడల్ షీటీంను ప్రత్యేకంగా ఏర్పాటుచేసినట్టు చెప్పారు.

 

గురువారం హైదరాబాద్‌లోని కార్యాలయంలో ప్రత్యేక షీటీం విభాగాన్ని ఎస్పీ సుమతి, అదనపు డీసీపీ కవితలతో కలిసి ప్రారంభించారు.మహిళలతోనే గ్రామీణాభివృద్ధి సాధ్యమవుతుందని, గ్రామీణ వ్యవస్థలో మార్పులు తీసుకురావాల్సిన బాధ్యత మహిళలపైనే ఉన్నదని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. సీఎం కేసీఆర్ గ్రామీణ ఆర్థికవ్యవస్థ బలోపేతానికి ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పి, వాటిని సంఘాలకు అప్పగిస్తున్నారని చెప్పారు.  స్త్రీనిధి ఎనిమిదేండ్లుగా ఒక మంచి ఆశయంకోసం పనిచేస్తున్నదని అన్నారు.

 

స్త్రీనిధి సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆ సేవలను  దేశ అంతటా  అమలుచేసేందుకు సన్నాహాలు చేస్తున్నదనిచెప్పారు . స్త్రీనిధి, సెర్ప్, మెప్మాలు నిరుపేదకుటుంబాల్లో వెలుగులు నింపుతున్నాయని వ్యాఖ్యానించారు . మహిళాసంఘాలు బ్యాంకర్లు పరస్పర స్నేహపూర్వకంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భం గా రూ.32 కోట్ల రుణాల చెక్కులను మహిళాసంఘాలకు మంత్రి అందించారు. స్త్రీనిధి సంస్థ ద్వారా విద్యార్థులకు స్కాలర్‌షిప్ చెక్కులను పంపిణీచేశారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: