తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న దిశ, సమ త ఘటనలతో ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. దర్యాప్తు క్రమంలో నిందితులు పోలీసులపై దాడిచేయడంతో ఆత్మరక్షణకోసం పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో వారు చనిపోయారు. లైంగికదాడులు, హత్యాచారం కేసులలో సత్వర శిక్షలు అమలుచేస్తేనే ప్రజల్లో విశ్వాసం ఏర్పడుతుందనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం పలుచర్యలు చేపట్టింది. దిశ కేసు ను వేగంగా విచారించేందుకు మహబూబ్‌నగర్‌లో ఫాస్ట్‌ట్రాక్ కోర్టును సైతం ఏర్పాటుచేసింది. ఆసిఫాబాద్ సమత ఘటన లో బాధితులకు సత్వరన్యాయం అందించేందుకు ప్రభుత్వం ఆదిలాబాద్‌లో ఫాస్ట్‌ట్రాక్ కోర్టును ఏర్పాటుచేసింది. ఈ కేసులో పారిపోతున్న నిందితులను పోలీసులు చాకచక్యం గా అరెస్ట్‌చేశారు. వీరిపై విచారణ కొనసాగుతోంది. 

 


ఇదే రీతిలో రాష్ట్రవ్యాప్తంగా మ‌హిళ‌ల‌ అట్రాసిటీ కేసులలో కూడా వేగంగా విచారణ జరిపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకు సంబంధించిన కేసుల విచారణ త్వరితగతిన పూర్తయ్యేందుకు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర హైకోర్టు గురువారం కీలక చర్యలు తీసుకున్నాయి. చిన్నపిల్లలపై లైంగికదాడి, లైంగిక నేరాల నుంచి రక్షణకల్పించే పోక్సో (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ అఫెస్సెస్) చట్టం కింద నమోదయ్యే కేసులను సత్వరం పరిష్కరించే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా 36 ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. సుమోటోగా స్వీకరించిన ఒక కేసులో సుప్రీంకోర్టు జారీచేసిన ఆదేశాల అమలుతోపాటు కేంద్ర ప్రభుత్వ సిఫారసుల మేరకు పోక్సో కేసుల విచారణకు హైకోర్టుతో సంప్రదించి, ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటుచేసినట్లు న్యాయశాఖ కార్యదర్శి ఏ సంతోష్‌రెడ్డి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఫాస్ట్‌ట్రాక్ కోర్టులకు అదనపు జిల్లా, సెషన్స్ క్యాడర్ జడ్జీలు నేతృత్వం వహిస్తారు. ఏడాదిపాటు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు కొనసాగనున్నాయి.

 

ఇదిలాఉండ‌గా, రాష్ట్రంలో దిశ, సమత వంటి దారుణ ఘటనల నేపథ్యంలో హైకోర్టు స్పందించింది. మహిళలపై జరిగే లైంగికదాడి, హత్యలు, ఇతర నేరాల్లో సత్వర న్యాయం అందించేందుకు చర్యలు చేపట్టింది. ఇందుకు అనుగుణంగా ఇప్పటివరకు ఉన్న ఖాళీలను భర్తీచేయాలని నిర్ణయించింది. ఈ మేరకు విమెన్ అట్రాసిటీ ప్రత్యేక న్యాయస్థానాలకు జడ్జీలను నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. వివిధ కోర్టుల నుంచి పదకొండుమం ది న్యాయమూర్తులను మహిళల కేసుల ప్రత్యే క కోర్టులకు బదిలీచేసింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: