బీజేపీ పౌరసత్వం బిల్లును తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.  పౌరసత్వం బిల్లు విషయంలో దేశంలో అల్లర్లు జరుగుతున్నాయి.  ప్రతిపక్ష పార్టీలు ఈ అల్లర్లు సృష్టిస్తున్నాయి.  కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో అల్లర్లు చేస్తున్నది.  ఇక బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ చేస్తున్న రగడ అంతాఇంతా కాదు.  పౌరసత్వం అమలు చేసేది లేదని స్పష్టం చేసింది.  బెంగాల్ లో పౌరసత్వం అమలు చేయబోమని, తమ రాష్ట్రంలో అవసరం లేదని చెప్తున్నది.  బీజేపీనే కావాలని ఇలాంటి అల్లర్లు సృష్టిస్తోందని ప్రభుత్వ ఆస్తులను కొల్లగొడుతున్నదని తృణమూల్ కాంగ్రెస్ స్పష్టం చేస్తోంది.  


అయితే, బీజేపీ మాత్రం ఈ విషయంలో వెనకడుగు వేయడం లేదు.  కేంద్రం తీసుకొచ్చిన ఈ చట్టాన్ని అన్ని రాష్ట్రాలు తప్పనిసరిగా అమలు చేయాలని  అంటోంది.  ముస్లిం దేశాల్లో ముస్లింలు మైనారిటీలు కాదని, మైనారిటీలు కానప్పుడు వాళ్లకు ఇండియాలో పౌరసత్వం ఎందుకు ఇవ్వాలని ప్రశ్నిస్తున్నారు.  ముస్లిం దేశాల్లో హిందువులు, ఇతర మతాలకు చెందిన వ్యక్తులు ఇబ్బందులు పడుతూ ఇండియాకు వచ్చి శరణార్థులుగా ఉన్న సమయంలో వాళ్లకు పౌరసత్వం కల్పించాలని కేంద్రం సవరణ తీసుకొచ్చింది.  


ఈ సవరణ విషయంలో మిగతా పార్టీలు కావాలని అల్లర్లు సృష్టిస్తున్నాయి.  2003వ సంవత్సరంలో మన్మోహన్ సింగ్ రాజ్యసభలో అడిగిన విషయాన్ని ఇప్పుడు బీజేపీ అమలు చేస్తోంది. ఇతర దేశాల నుంచి వచ్చే మైనారిటీలకు ఇండియా పౌరసత్వం కల్పించాలని చెప్పి అప్పటి బీజేపీ ప్రభుత్వాన్ని మన్మోహన్ సింగ్ కోరారు.  ఇప్పుడు దానిని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్నది.  దీనికి పార్టీలు ఎందుకు అంతలా రాద్ధాంతం చేస్తున్నాయో తెలియడం లేదు.  


ఇక ఇదిలా ఉంటె, మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వానికి ఓ ఛాలెంజ్ విసురుతున్నది.  అదేమంటే, దేశవ్యాప్తంగా ఈ విషయంలో మెమోరండం నిర్వహించాలని, అందులో బీజేపీ ఓడిపోతే కేంద్రం నుంచి బీజేపీ తప్పుకోవాలని అంటోంది.  ఒకవేళ నిజంగా మెమోరండం పెడితే కనుక బీజేపీ ఈ విషయంలో తప్పకుండా విజయం సాధిస్తుంది అనడంలో సందేహం అవసరం లేదు.  దేశంలో మెజారిటీ ప్రజలు పౌరసత్వం బిల్లుకు అనుకూలంగానే ఉన్నారనే విషయం అందరికి తెలిసిందే.  

మరింత సమాచారం తెలుసుకోండి: