రాజధాని కోసం రైతుల వద్ద తీసుకున్న 33  మూడు వేల ఎకరాల భూములు రైతులకు తిరిగి ఇచ్చేస్తాం. రాజధాని భూములు తిరిగి ఇచ్చేస్తాను అని ఎన్నికల ముందే జగన్ ప్రకటించారని మంత్రి పెద్దిరెడ్డి  రామచంద్రా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని తరలించవద్దని ధర్నాలు చేసేదంతా టిడిపి కార్యకర్తలు. ఇన్సైడర్ ట్రేడింగ్ విచారణ జరుగుతుంది. లెజిస్లేటివ్ క్యాపిటల్ కు 300 ఎకరాలు సరిపోతుంది. తుళ్లూరు లో తక్కువ ధరలకు తెలుగుదేశం నేతలు భూములు కాజేశారు. రైతుల భూములను తిరిగి ఇచ్చేస్తాం అన్న మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యలకు రాజధాని  రైతుల ఘాటు స్పందన. ఇన్నేళ్లు కాపురం చేసిన తన భార్యకు మంత్రి పెద్దిరెడ్డి విడాకులు ఇచ్చి తిరిగి కన్యగా వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగిస్తారా. రాజధాని రైతులు. తమను పెయిడ్ ఆర్టిస్టులు అని అంబటి రాంబాబు కిచపరిచారంటూ ఎస్సీ, ఎస్టీ రైతుల మండిపాటు.

పొలం పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డులతో దీక్షకు కూర్చున్న రైతులు. 29 గ్రామాల రైతులు ఆందోళన చేస్తుంటే స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు ఎక్కడ దాక్కున్నారని రైతుల ఆగ్రహం. ఇతర జిల్లాల నుంచి తమ దీక్షకు మద్దతు తెలుపుతున్న వివిధ సంఘాలకు రైతులు పేరు పేరున కృతజ్ఞతలు. గుంటూరు జిల్లా తుళ్ళూరులో ఉదయం ఏడుగంటలకే వాహనాల రాకపోకలు అడ్డుకున్న రాజధాని యువత. రైతుల ధర్నాకి పోలీస్ శాఖ గట్టి భద్రత ఏర్పాటు చేశారు. రాజధాని సమారావతి సమరంలో పటిష్ట బందో బస్తు. రెండో రోజు బందోబస్తులో ఇద్దరు అడిషనల్ ఎస్పీలు, ఎనిమిది మంది డిఎస్పీలు,15 మంది సిఐలు, 32 మంది ఎస్ ఐలు.. 600 మందితో మొత్తం బందోబస్తు ఏర్పాటు చేశారు.

తుళ్ళూరులో రైతులు, కూలీలు వంటా వార్పు మొదలు పెట్టారు. ఇదిలా ఉండగా  ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పిన  మూడు రాజధానులు ఉండొచ్చన్న మూడు రోజులకే నివేదిక వస్తుండటం ఆసక్తికరంగా మారింది. అంతేకాదు సీఎం కూడా ఈ నివేదిక ఆధారంగానే రాజధానిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పడంతో ప్రజలందరి దృష్టి దీనిపైనే ఉంది. జీఎన్ రావు నేతృత్వంలో ఏపీ ప్రభుత్వం రాజధాని కోసం నిపుణుల కమిటీని నియమించింది. ఈ కమిటీ రాజధానిపై ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించించి.

రాష్ట్రవ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో పర్యటించి ప్రజలతో పాటూ ప్రభుత్వ అధికారులు, రాజకీయ నిపుణులతో పాటూ మరికొన్ని వర్గాల నుంచి అభిప్రాయాలు సేకరించింది. జిల్లాల్లో పరిస్థితులు, భూములపై ఆరా తీసింది.. ఆయా జిల్లాల్లో ఉన్న అనుకూలతలు, ప్రతికూలాంశాలు, అందుబాటులో ఉన్న భూమి, మానవ వనరులపై అధ్యయనం చేసింది. రెండు రోజులుగా కమిటీ నివేదికకు తుది మెరుగులు దిద్దింది. నివేదిక సిద్దం కావడంతో ముఖ్యమంత్రికి అందజేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మరి జీఎన్ రావు కమిటీ ఎలాంటి అభిప్రాయాలను వెలబుచ్చుతుంది అన్నది ఉత్కంఠగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: