ఒకటి కాదు.. రెండు కాదు ప్రతిరోజు పదుల సంఖ్యలో దేశంలో మహిళలపై, చిన్నారులపై అత్యాచారాలు జరుగుతున్నాయి.  దేశ వ్యాప్తంగా నిర్భయ, దిశ కేసులు సంచలనాలు సృష్టిస్తున్నా కామాంధుల్లో కొంచమైనా భయం కలగడం లేదు.  పైగా తాము చేసిన దారుణాలు వీడియో షూట్ చేసి మరీ తమ ఫ్రెండ్స్ కి షేర్ చేస్తున్నారు.  అత్యాచారాలకు పాల్పపడినవారిని వెంటనే ఉరిశిక్ష విధించాలని లేదా దిశ నింధితులను ఎన్ కౌంటర్ చేసినట్లు చేయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.  ఎంత మంది ఎన్ని డిమాండ్లు చేసినా.. నిరసనలు చేసినా ప్రతిరోజూ ఎక్కడో అక్కడ ఆడవారిపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు చివరికి హత్యలు కూడా చేస్తున్నారు కొంత మంది మృగాళ్లు.  అలా ఓ మృగాడి చేతిలో బలైన కాలు విరిగిన తన కూతురుని ఆసుపత్రిలో వీల్ చైర్ లేకపోవడంతో తన వీపుపై ఆసుపత్రికి మోసుకు వెళ్లిన ఓ తండ్రి ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో కన్నీరు పెట్టిస్తున్నాయి. ఈ దయనీయ ఘటన యూపీలో చోటుచేసుకుంది.

 

తమ ఇంటిపక్కన నివసిస్తున్న 19 ఏళ్ల యువకుడు బాలికను బలవంతంగా ఇంట్లోకి తీసుకెళ్లి గంటల తరబడి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ మృగాడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించిన ఆ బాలిక కాలు విరిగింది.  తండ్రి కూతురు పరిస్థితిపై మర్హేరా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు అంకిత్ యాదవ్ ను అరెస్ట్ చేసారు. మహిళా కానిస్టేబుల్ ను ఇచ్చి బాలికను వైద్య పరీక్షలకు పంపించారు. ఆ సమయంలో అంబులెన్స్ లేదు. వీల్ చైర్ లేదు..కనీసం స్ట్రచర్ కూడా లేదు.

 

దాంతో తన కూతురు ప్రాణాలు కాపాడుకునేందుకు ఆ తండ్రి తన వీపుపై మోసుకుంటూ.. హాస్పిటల్ కు తీసుకువెళ్లాడు. తీరా అక్కడికి వెళ్లిన తర్వాత హాస్పిటల్ లో బాధితురాలిని పరీక్షించటానికి ఎటువంటి పరికరాలు పనిచేయటంలేదని సిబ్బంది తెలిపారు.  అయితే ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. సీఎం జోక్యం చేసుకోవటంతో అలిఘర్ హాస్పిటల్ కు తరలించారు. ఈ వీడియో ఉన్నతాధికారు విచారణకు ఆదేశించారు.  ఇలాంటి సంఘటనలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో తరుచూ జరగడం.. ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం సర్వ సాధారణం అయ్యిందని ఆవేదన చెందుతున్నారు ప్రజలు.  

మరింత సమాచారం తెలుసుకోండి: