తెలంగాణలో గత కొంతకాలంగా టిపిసిసి మార్పు జరుగుతుంది అని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. గతంలో హుజూర్ నగర్ ఉప ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే టిపిసిసి మార్పు జరుగుతుందని అనుకున్నారు అంతా .అంతే కాకుండా తెలంగాణ  పీసీసీ పదవి నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పుకుంటున్నారు అంటూ వార్తలు వచ్చాయి. ఇక  టీపీసీసీ పదవినీ అధిష్టానం రేవంత్ రెడ్డికి కట్టబెట్టడం జరుగుతుంది అన్న వార్తలు కూడా రాగా.. కాంగ్రెస్ సీనియర్ నేతలు అందరూ డిల్లీలో వాలి పోయి టిపిసిసి పదవి మార్పును వాయిదా వేయాలంటూ అధిష్టానాన్ని కోరడంతో టీపీసీసీ పదవి మార్పు  వాయిదా పడింది. అయితే టీ పీసీసీ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గుడ్బై చెప్పబోతున్నారని..  అందుకే పిసిసి ఛీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గత కొంతకాలంగా పార్టీ వ్యవహారాలను పెద్దగా పట్టించుకోవడం లేదంటూ వార్తలు కూడా వచ్చాయి.

 


 అయితే తాజాగా ఆయన టీపీసీసీ చీఫ్ హోదాలో  ఉత్తమ్ పార్టీ సమావేశం ఏర్పాటు చేయడంతో... కొంతకాలంపాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ  పిసిసి చీఫ్ గా  కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. హుజూర్ నగర్ ఉప ఎన్నికల తర్వాత టీపీసీసీ చీఫ్ పదవిని మార్పు చేయాలని భావించిన అధిష్టానం ఇప్పుడు మరోసారి... టీపీసీసీ చీఫ్ మార్పును వాయిదా వేయడానికి బలమైన కారణం ఉందని ప్రచారం జరుగుతోంది. త్వరలోనే తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో... ఈ క్రమంలో టీపీసీసీ చీఫ్ మార్పు చేపడితే కాంగ్రెస్ పార్టీకి నష్టం వాటిల్లుతుందని.. ఈ సమయంలో టీపీసీసీ చీఫ్ మార్పు సరైన నిర్ణయం కాదని కొందరు రైతులు హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లడం తోనే... టీపీసీసీ చీఫ్ మార్పు వాయిదా పడినట్లు తెలుస్తోంది. 

 


 ఒకవేళ తెలంగాణలో టిపిసిసి మార్పు చేపడితే... అధ్యక్షుడిగా కొత్తగా ఎన్నికైన నేత మున్సిపల్ ఎన్నికలపై దృష్టి పెట్టడం కష్టమవుతుందని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే తెలంగాణలో త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలను ఉత్తమ్  సారథ్యంలోని ఎదుర్కోవాలని నిర్ణయించుకుందట కాంగ్రెస్ అధిష్టానం. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు పూర్తయిన తర్వాత టిపిసిసి కి కొత్త అధ్యక్షుడిని నియమించాలని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే టీపీసీసీ పదవిని దక్కించుకునేందుకు కాంగ్రెస్ సీనియర్ నేతలతో పాటు మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఎవరికి వారు టీపీసీసీ పదవి తమకే వస్తుందని ధీమాతో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: