ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం మరియు అదే విధంగా రాజధాని విషయం కోసం రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ జీఎన్‌ రావు అధ్యక్షతన సీఎం జగన్ సెప్టెంబర్ 13వ తారీఖున కమిటీ వేయడం మనకందరికీ తెలిసినదే. ఈ నేపథ్యంలో తాజాగా ఈ నిపుణుల కమిటీ సభ్యులు సీఎం జగన్ తో భేటీ అయ్యారు. నివేదికను జగన్ కి సమర్పించారు. అనంతరం మీడియాతో కమిటీ సభ్యులు మాట్లాడటం జరిగింది. రాజధాని విషయంలో రాష్ట్రంలో అధ్యయనం చేయడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలో పర్యటించడం జరిగింది. ప్రజాభిప్రాయ సేకరణ అనుగుణం ప్రకారం ముఖ్యమంత్రికి నివేదిక ఇచ్చాం. రాష్ట్ర రాజధాని విషయంలో ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో అసమానతలు ఉన్నాయి.

 

అంతేకాకుండా కొన్ని వెనకబడిన ప్రాంతాలు కూడా ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నాయి మరి కొన్ని ప్రాంతాలు అయితే అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అభివృద్ధి చెందిన ప్రాంతాలతో వెనుకబడిన ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలంటే రెండంచెల వ్యూహాన్ని సూచించినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉంది అలాగే నదులు మరియు అడవులు ప్రకృతి పరంగా పర్యావరణం ప్రకారంగా రాష్ట్ర అభివృద్ధి చెందటం కోసం అనేక మార్గాలు ఉన్నాయి వాటి కనుగుణంగా సూచనలు ఇచ్చాం. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. అభివృద్ధి అంటే పర్యావరణాన్ని పాడు చేసుకోవడం కాదు. అన్ని ప్రాంతాలను దృష్టిలో ఉంచుకుని సూచనలు ఇచ్చాం.

 

వరద ముంపులేని రాజధాని ఉండాలని సూచనలు చేశాం. సుమారు 10,600 కిలోమీటర్లు తిరిగాం. రాజధాని, అభివృద్ధి అంశాలపై అధ్యయనం చేశాం. అంతా ఒకేచోట కాకుండా అందరికీ అనుకూలంగా వడ్డెర సూచనలు నివేదికలో ఇచ్చాం ఇచ్చిన నివేదిక ప్రకారం అందరికీ సమన్యాయం భవిష్యత్తులో జరుగుతుందని...ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో ఉన్న తుళ్లూరు ప్రాంతానికి వరద ముప్పు ఉందని కమిటీ సభ్యులు మీడియా ముఖంగా తెలిపారు. మొత్తంమీద చూసుకుంటే ఆంధ్ర ప్రదేశ్ దిశా, దశ మార్చేలా జీఎన్‌.రావు కమిటీ నివేదిక ముఖ్యమంత్రి జగన్ కి ఇచ్చినట్లు అర్థం అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: