ఏపీ ప్రభుత్వం కొన్ని నెలల క్రితం ఏర్పాటు చేసిన జీఎన్ రావు కమిటీ చేసిన సూచనలు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు షాక్ అనే చెప్పవచ్చు. జీఎన్ రావు కమిటీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ తుళ్లూరు ప్రాంతానికి వరద ముంపు ఉందని వరద ముంపు లేని రాజధాని ఏర్పాటు చేయాలని సూచనలు చేసింది. రాజధాని ప్రాంతానికి వరద ముంపు ఉందని చంద్రబాబుకు రాజధాని ఏర్పాటుకు ముందే పలు నివేదికలు అందినా చంద్రబాబు ఆ నివేదికలను నిర్లక్ష్యం చేశారు.
 
ఇప్పుడు కమిటీ కూడా అమరావతి ప్రాంతం రాజధానికి సరైన ప్రాంతం కాదని  తేల్చటంతో బాబు ఆలోచన తప్పని తేలిపోయింది. కమిటీ నివేదిక సీఎం జగన్ ప్రకటనకు అనుగుణంగానే ఉండటం గమనార్హం. కమిటీ హైకోర్టు రాజధానులు భిన్న ప్రాంతాలలో ఉండాలని సూచనలు చేసింది. కమిటీ విశాఖలో సచివాలయం, సీఎం క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేయాలని సూచనలు చేసింది. 
 
హైకోర్టు బెంచ్ కూడా విశాఖలోనే ఏర్పాటు చేయాలని సూచనలు చేసింది. అసెంబ్లీ సమావేశాలు తుళ్లూరులో ఏర్పాటు చేయాలని వేసవి అసెంబ్లీ సమావేశాలు మాత్రం విశాఖలో ఏర్పాటు చేయాలని సూచించింది. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని సూచనలు చేసింది. కర్నూలులో హైకోర్టు, అమరావతిలో ఒక బెంచ్, విశాఖలో మరో బెంచ్ ఏర్పాటు కాబోతుంది. 
 
ప్రభుత్వానికి నాలుగు ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలని సూచనలు చేసినట్లు కమిటీ వెల్లడించింది. ఉత్తరాంధ్ర, మధ్య కోసా, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాలుగా విభజించి అభివృద్ధి చేయాలని చెప్పినట్టు కమిటీ వెల్లడించింది. జీఎన్ రావు కమిటీ చేసిన సూచనలు చంద్రబాబుకు, అమరావతిలో భూములు కొనుగోలు చేసిన తెలుగుదేశం పార్టీ నేతలకు షాక్ అనే చెప్పవచ్చు. చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ నేతలు కమిటీ నివేదిక గురించి ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. కర్నూల్, వైజాగ్ వాసులు కమిటీ నివేదిక పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఉండటం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: