ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాయలసీమ ప్రాంతం చాలా సస్యశ్యామలంగా వ్యవసాయ పరంగా మరియు అభివృద్ధి అయింది ఇంకా అనేక రకాలుగా ఈ ప్రాంతం డెవలప్ అయింది. అయితే ఆ తర్వాత వచ్చిన పరిపాలకులు రాయలసీమ ప్రాంత వాసులు అయినా గాని పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఎప్పుడైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు గురైందో మిగిలిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయినా గాని రాయలసీమ ప్రాంతంలో పెద్దగా అభివృద్ధి పనులు జరగలేదు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇదే క్రమంలో వైయస్ మరణించిన నాటి నుండి జగన్ రాజకీయ జీవితానికి అండగా ఉన్న ప్రజలు ముందు నుండి ఎవరైనా అంటే రాయలసీమ ప్రాంత ప్రజలు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

 

దీంతో ఇటువంటి తరుణంలో తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ల విషయంలో వైయస్ జగన్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ జీఎన్‌.రావు అధ్యక్షతన సెప్టెంబర్ 13వ తారీఖున కమిటీ వేయటం జరిగింది. ఈ కమిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి మరియు అదే విధంగా రాష్ట్ర రాజధాని అంశం గురించి కూడా నివేదిక ఇవ్వాలని కోరటంతో...ఈ కమిటీ సభ్యులు రాష్ట్రమంతటా పర్యటించి రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న మార్గాలు అదేవిధంగా రాష్ట్ర రాజధానిపై ప్రజలలో ఉన్న అసమానతలు గురించి సీఎం జగన్ కి నివేదిక ద్వారా తెలపడం జరిగింది.

 

ఇదే క్రమంలో అభివృద్ధి పరంగా రాయలసీమ ప్రాంతంలో ఉన్న వనరుల గురించి కూడా సీఎం జగన్ కి తెలపడంతో...ఆ వార్త విని రాయలసీమ ప్రాంత వాసులు మళ్లీ వైయస్ పుట్టాడు జగన్ రూపంలో ఈ ప్రాంతమంతటా అభివృద్ధి చెందటం గ్యారెంటీ..అందరినీ సమానంగా చూసే ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రమంతటా సమాన అభివృద్ధి చేయడానికి తీసుకుంటున్న నిర్ణయాలు చాలా గ్రేట్ అని రాయలసీమ ప్రాంత ప్రజలు జగన్ పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: