తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇంతటి ప్రాచుర్యం ఉందొ  అందరికీ తెలిసిందే. ఒక తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా... దేశ నలుమూలల నుంచి తిరుపతికి భక్తులు విచ్చేస్తుంటారు. శ్రీవారిని దర్శించుకుని శ్రీవారి కృపకు పాత్రులు అవుతూ ఉంటారు. ఎంతటి ధనవంతుడైన ఎంతటి పేదవారైనా... శ్రీవారిని దర్శించుకుని తరించి పోతూ ఉంటారు. ఏ సీజన్లో అయినా శ్రీవారి ఆలయం భక్త జనంతో కిటకిట లాడుతూ ఉంటుంది. చాలా మంది ప్రజలు ప్రతి ఏడు తిరుపతి శ్రీవారి దర్శనం చేసుకుంటూ ఉంటారు. తిరుపతిలో తేజో మానంగా సప్త వర్ణ శోభితంగా అలంకృతుడైన  స్వామివారిని దర్శించుకుని పునీతులు అవుతూ ఉంటారు. 

 

 

 

 అయితే తిరుపతి కి వెళ్ళిన భక్తులు శ్రీవారిని దర్శించుకోవడం తో పాటు స్థానిక పర్యాటక ప్రాంతాలను ఆలయాలను  కూడా దర్శించుకుంటూ వుంటారు. అయితే తిరుపతి కి వెళ్లడం కాస్త ఖర్చుతో కూడుకున్న పనే. అయినా కానీ తిరుపతికి వెళ్లేందుకు భక్తులు ఆసక్తి చూపుతుంటారు. కొంత మంది పేద వారు జీవితంలో ఒక్కసారైనా తిరుపతికి వెళ్లి శ్రీవారి దర్శించుకోవాలని అనుకుంటూ ఉంటారు. తిరుపతికి వెళ్లి శ్రీవారిని దర్శించుకున్న భక్తులు అందరూ తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని మహా ప్రసాదంగా స్వీకరిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ అసలు విషయం ఏమిటంటే... తిరుపతికి వెళ్లి శ్రీవారిని దర్శించుకుని సమీపంలోని మిగతా పర్యాటక ప్రాంతాలు సహా ఆలయాలకు  పర్యటిస్తున్న పర్యాటకులకు ఏపీటీడీసీ ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటించింది. 

 

 

 

 ప్రభుత్వ సంస్థ ఏపీటీడీసీ పలు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించడం ద్వారా తిరుపతికి వచ్చే పర్యాటకులకు తక్కువ ఖర్చుతో సమీప పర్యాటక ప్రాంతాలను కూడా దర్శించుకునేందుకు వీలు కల్పిస్తుంది ఈ సంస్థ. ప్రభుత్వ సంస్థ  టీటీసీ  ప్రకటించిన ప్యాకేజీల లో ఒక రోజు.. రెండు రోజులు.. మూడు రోజులు టూర్ ప్యాకేజీలు అందుబాటులో ఉంచింది. తిరుపతికి వచ్చే భక్తులందరూ శ్రీవారిని దర్శించుకున్న అనంతరం.. సమీపంలోని ఇతర ఆలయాలను దర్శించుకోవాలి అనుకుంటే... ఈ ప్యాకేజీలను బుక్ చేసుకొని తక్కువ ఖర్చుతో ఇతర ఆలయాలను కూడా దర్శించుకోడానికి వీలు కల్పిస్తుంది ఈ సంస్థ. ఈ ప్యాకేజీ లకు సంబంధించిన వివరాలు ఏపీటీడీసీ తెలుసుకోవడానికి వీలు ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: