ఢిల్లీ  విశ్వవిద్యాలయం (డియు) నుండి చరిత్రలో మాస్టర్స్ చదువుతున్న శ్రేయా ప్రియమ్ రాయ్ (21), జంతర్ మంతర్ వద్ద ఢిల్లీ  పోలీసులకు ఎర్ర గులాబీని అందించే చిత్రం ఇంటర్నెట్ సంచలనంగా మారుతుందని,   ఆ చిత్రం  పౌరసత్వ సవరణ చట్టం (సిఏఏ ) కు వ్యతిరేకంగా జరుగుతున్నా విద్యార్థుల నిరసనలకు  ముఖ చిత్రం  అవుతుందని ఎవరు ఊహించలేదు.

 

 

 

 

 

 

 

శ్రేయ కొత్తగా వచ్చిన కీర్తి ని స్వాగతించినప్పటికీ , కారణం  పై ఎక్కువ దృష్టి పెట్టాలని ఆమె కోరుకుంటుంది. నేను కార్యకర్తని కాదు. నేను ఆర్టిస్ట్ కావాలని కోరుకునే సాధారణ విద్యార్థిని మరియు ఈ విధంగా వైరల్ అవ్వాలని అనుకోలేదు అని ఆమె అన్నది.  గురువారం, జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం, డియు మరియు అనేక ఇతర ప్రైవేట్ విశ్వవిద్యాలయాల విద్యార్థులు జంతర్ మంతర్‌లో సిఎఎకు వ్యతిరేకంగా ఒక రోజు నిరసన చేపట్టారు.ఒక  కరస్పాండెంట్ క్లిక్ చేసిన శ్రేయ  యొక్క చిత్రం చాలాసార్లు సోషల్ మీడియా లో షేర్ చేయబడింది. ఈ చిత్రాన్ని చూసి  ఇటువంటి అల్లర్ల సమయంలో  శాంతి కోసం ఒక  సందేశం ఇవ్వాలని  ధైర్యంగా  ఒక  పోలీసు అధికారికి పువ్వు ఇచ్చి నిరసన తెలిపిన   ఆమె  ఎవరు అని చాలామంది ఆశ్చర్యపోయారు.

 

 

 

 

 

 

 

 

నేను పోలీసులకు గులాబీలను ఇచ్చాను ఎందుకంటే జెఎన్‌యు, డియు, అస్సాం లేదా జామియా విశ్వవిద్యాలయంలో వారు విద్యార్థులను కనికరం లేకుండా కొట్టారు. విద్యార్థులు హింసాత్మకంగా లేరని నేను వారికి తెలియజేయాలనుకుంటున్నాను, మేము ప్రభుత్వ విధానాలను శాంతియుతంగా వ్యతిరేకిస్తున్నాము అని ఆమె అన్నారు.

 

 

 

 

 

 

 

ఔత్సాహిక  స్టాండ్-అప్ కమెడియన్  శ్రేయ , మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఎన్‌పిఆర్-ఎన్‌ఆర్‌సి వర్తించినప్పుడు, ప్రతి ఒక్కరూ తాము ఈ దేశానికి చెందినవారని పత్రాల ద్వారా నిరూపించాల్సి ఉంటుంది. ఇది అధికారికంగా ముస్లింలకు బాధను కలిగిస్తుంది.  మీరు ఎంత భారతీయులైనా మీరు భారతీయుడని నిరూపించుకోవాలి. ఇది మన రాజ్యాంగాన్ని, మన దేశంలోని లౌకిక నీతిని ఉల్లంఘిస్తుంది. ఇది ప్రతి ఒక్కరికీ జీవితాన్ని కష్టతరం చేస్తుంది అని ఆమె అన్నారు. 

 

 

 

 

 

 

 

శ్రేయ ప్రకారం  ఈ సంవత్సరం  ఆమె  లోక్ సభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి,  బీజేపీ  మిత్రపక్షమైన జనతాదళ్ (యునైటెడ్) కారణంగా ఓటు వేసింది, కాని ఇప్పుడు ఆమె ఆ కూటమికి ఓటు వేసినందుకు చింతిస్తున్నాను అని పేర్కొంది.  బిజెపి పార్టీ మరియు మద్దతుదారుల ప్రకారం సిఎఎ పొరుగు దేశాలలో తమ మతం ఆధారంగా హింసించబడుతున్న వర్గాలను రక్షించడం  లక్ష్యం గా చెబుతున్నారు.  ఇదే బీజేపీ వారి ప్రధాన లక్ష్యం ఐతే , భారత్ పొరుగున వున్నా   రోహింగ్యా ముస్లింలు ,  శ్రీలంక తమిళులను వారు ఎందుకు రక్షించడానికి ముందుకు రావట్లేదు అని ఆమె ప్రశ్నిచారు.

 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: