తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా టిఆర్ఎస్ ప్రభుత్వం హరితహారం కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. ఆకుపచ్చ తెలంగాణ లక్ష్యంగా హరితహారం  కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలా చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా వందల కోట్లు ఖర్చు పెట్టి మొక్కలు నాటి స్తోంది. రాష్ట్రంలోని ప్రతి చోటా ఇప్పటికే మొక్కలు నాటే కార్యక్రమాలు కూడా చేపట్టింది సర్కార్. ఇక నూతనంగా ఎన్నికైన పంచాయతీ పాలకవర్గానికి కూడా గ్రామంలో పచ్చదనాన్ని పెంపొందించడం కోసం  హరితహారం కార్యక్రమం చేపట్టి మొక్కల సంరక్షణ కూడా చేపట్టాలని ఆదేశించిన విషయం తెలిసిందే. 

 

 

 

 ఈ క్రమంలోనే పలుచోట్ల హరితహారం మొక్కలను నాశనం చేసిన వాళ్ళకి జరిమానాలు కూడా విధించడం జరిగింది. అయితే మొక్కలు  నాటడమే కాదు వాటి సంరక్షణ బాధ్యతలను కూడా అధికారులకు అప్పజెప్పింది తెలంగాణ సర్కార్. హరితహారం లో భాగంగా నాటిన మొక్కలు ఇప్పుడు ఏకంగా చెట్లు గా మారిపోయి. అయితే కొందరు వ్యక్తులు మాత్రం హరిత హారంలో నాటిన చెట్లను నరికి వేస్తున్నారు. తాజాగా సిద్దిపేటలో ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. సిద్దిపేటలో హోర్డింగ్  కు అడ్డు వస్తున్నాయి అంటూ నాలుగు చెట్లను నరికేశారు నిర్వాహకులు. దీంతో అధికారులు వారికి భారీ ఫైన్ వేసారు. సిద్దిపేట పట్టణంలోని శివామ్స్  గార్డెన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 

 

 

 

 శివమ్స్  గార్డెన్ సమీపంలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ హోర్డింగ్  ఏర్పాటు చేశారు నిర్వాహకులు. అక్కడి హరిహారంలో నాటిన మొక్కలు కాస్త చెట్ల అవడంతో తమ హోల్డింగ్ కనిపించకపోవడంతో అక్కడ  ఉన్న చెట్ల కొమ్మలను నరికేశారు . అయితే సీసీటీవీ ఫుటేజీ ద్వారా చెట్లను  నరికిన వాళ్లను గుర్తించిన అధికారులు వారికి జరిమానా విధించారు. మున్సిపల్ చైర్మన్ రాజనర్సు కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు... చెట్లను నరికిన సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వారికి హార్టికల్చర్ అధికారి ఐలయ్య 45 వేల రూపాయల జరిమానా విధించారు. సిద్దిపేట పట్టణంలో చెట్లకు ఎవరు హాని కల్పించిన జరిమానాలు తప్పవని హెచ్చరించారు అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: