కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి పౌరసత్వ సవరణ చట్టంపై దేశంలో జరుగుతున్న ఆందోళనలకు విపక్షాలు బాధ్యత వహించాలని ఆయన  అన్నారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని మతపరమైన విద్వేషాలు సృష్టించేందుకే  విపక్షాలు వాడుకుంటున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి మండిపడ్డారు. అంతేకాదు ఈ విధంగా  పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకించేవారు కచ్చితంగా పాకిస్తాన్ కి మద్దతుదారులని విమర్శించారు. 

 

పాకిస్థాన్‌, ఆఫ్ఘనిస్తాన్‌, బంగ్లాదేశ్‌లో వివక్ష ఎదుర్కొంటున్న వారికి భారత్‌లో పౌరసత్వం కల్పిస్తున్నామన్నారు.నిజానికి  ఈ మూడు దేశాల్లో ముస్లింలు వివక్ష ఎదుర్కోవడం లేదని, ఈ దేశాల్లో ముస్లిమేతరులే మైనారిటీలుగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. దేశంలో ఉన్న చొరబాటుదారులను, శరణార్థులను వేరు వేరుగా చూస్తున్నామని, 30-40 సంవత్సరాల క్రితం శరణార్థులుగా వచ్చినవారికే పౌరసత్వం కల్పిస్తున్నామని తెలిపారు. 

 

ఈ సందర్బంగా మాట్లాడుతూ ... దీనివల్ల ఈశాన్య రాష్ట్రాల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అలాగే ఈ విధంగా చేయడం వల్ల   భారతీయ పౌరులకు ఎటువంటి నష్టం జరగదని ఆయన వివరించారు.ఈ విధంగా పౌరసత్వ సవరణ చట్టంపై దేశంలో జరుగుతున్న ఆందోళనలకు విపక్షాల గురించి తెలియచేశాడు .ఇక తాజాగా  జరిగిన ఎన్నికలల్లో  పౌరసత్వంకు సంబంధించిన అంశంపై  బీజేపీ ప్రభుత్వం  హామీ ఇచ్చిన విషయం తెలిసిందే ,ఈ  పౌరసత్వం చట్టం ఎటువంటి ఆలోచన చేయకుండా  కార్యరూపం దాల్చలేదని కిషన్‌రెడ్డి వెల్లడించారు.

 

 అంతే కాదు ఇంతకముందు కూడా వలస వచ్చిన వారికీ ప్రభుత్వం పౌరసత్వం కల్పించింది కాగా, శ్రీలంక నుంచి తమిళనాడుకు వలస వచ్చిన తమిళులకు గతంలోనే పౌరసత్వం ఇచ్చామని, ఒకవేళ శ్రీలంక ప్రభుత్వం కోరితే శరణార్థులకు పౌరసత్వం కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ చట్టాన్ని మతపరంగా చూడొద్దని, ప్రజల ఆస్తులకు నష్టం కలిగించవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చక్కదిద్దెందుకు రాష్ట్రాలు కోరితే కేంద్రం నుంచి అదనపు బలగాలను పంపిస్తామని కిషన్‌రెడ్డి తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: