'కడుపు కోత' ఇది ఎంత దారుణంగా ఉంటుందో తెలుసా ? ఇది దారుణం.. ఒక పెద్ద భాద. ఈ భాధ ఎవరికి రాకూడదు. శత్రువుకి కూడా ఈ కడుపు కోత రాకూడదు. అనుభవిస్తేనే కాదు చూస్తే కూడా శత్రువు కళ్ళల్లో నీళ్లు ఆగవు. ఇంత చెప్తున్నాను.. అసలు కడుపు కోత అంటే ఏంటో తెలుసా ?   

 

నవమాసాలు మోసిన అమ్మకు, వేలు పట్టుకొని నడిపించి.. భుజాలపై మోసిన నాన్నకు.. చేతికి అందిన బిడ్డ 100 ఏళ్ళ అద్భుతమైన జీవితం కనిపించిన సమయంలో.. అనుకోని రీతిలో అర్దంతరంగా ఆ బిడ్డ తిరిగిరాని అనంతలోకాల్లోకి వెళ్తే ఆ సమయంలో ఆ భాద ఎంత దారుణంగా ఉంటుంది అంటే.. అది ఒక్క కన్నీళ్లతో పోయేది కాదు. 

 

అలాంటి దారుణమైన భాద అది.. బిడ్డ ఏలాంటి వాడు అయినా కడుపులో పెట్టుకొని చూసుకుంటారు తల్లితండ్రులు. అలాంటి తల్లితండ్రులు ఒక్కసారిగా బిడ్డను పోగుట్టుకుంటే బాధ చెప్పలేనిది. ఆ పోగొట్టుకున్న బిడ్డ కోసం బాధ ఎలా ఉంటుందో చెప్పలేనిది. కుమిలి కుమిలి బాధ పడుతారు ఆ తల్లితండ్రులు. 

 

అందుకే.. ఆలాంటి కడుపుకోతను తల్లిదండ్రులకు మిగల్చకుండా.. బయటకు వెళ్లిన సమయంలో జాగ్రత్తగా ఉండటం.. అతి వేగంతో ప్రయాణం చెయ్యకుండా కాస్త ఆలస్యం అయినా పరవాలేదు జాగ్రత్తగా ప్రయాణం చెయ్యండి. అంతేకాదు ఏలాంటి పరిస్థితుల్లో ఉన్న తప్పులు చెయ్యకుండా ఉండాలి. 

 

ఎంత పేదవారైన సరే క్షేణాకావేశంలో నేరాలు చేస్తే.. అటు మీ జీవితం ఇటు తల్లిదండ్రుల జీవితం అస్తవ్యస్తం అవుతుంది. అందుకు నిదర్శనం దిశ ఘటన. దిశ మరణంతో ఆమె తల్లిదండ్రులు.. ఆమె మరణానికి కారణమైన నలుగురు నిందితులు మరణంతో వారి కుటుంబాలు ఏలాంటి భాదను అనుభవిస్తున్నాయి మనకు కనిపిస్తూనే ఉంది. బిడ్డ ఎంత నీచులు అయినా సరే తల్లితండ్రుల కడుపుకోత ఒకటే కదా.. 

మరింత సమాచారం తెలుసుకోండి: