జమ్మూ కాశ్మీర్ , హిమాచల్ ప్రదేశ్ లలో  తాజా హిమపాతంతో శుక్రవారం ఉత్తర భారతదేశంలో చలి తీవ్రత  బాగా పెరిగింది., ఢిల్లీ  లో పొగమంచు కారణంగా  ఉదయం 760 విమానాలను ఆలస్యం చేసి 19  విమానాలు  రద్దు చేయాల్సి వచ్చింది.  100 కి పైగా రైళ్లు షెడ్యూల్ కంటే రెండు గంటలు ఆలస్యంగా నడిచాయి.

 

 

 

 

 

 

 

 

 

జాతీయ రాజధాని కూడా చల్లటి రోజును ధైర్యంగా ఎదుర్కొంది. ఉష్ణోగ్రత  6.4 డిగ్రీల సెల్సియస్ వద్ద స్థిర పడింది. ఉదయం కొన్ని చోట్ల దృశ్యమానత సున్నాకి తగ్గిందని, రైలు, విమాన సేవలను ప్రభావితం చేస్తుందని అధికారులు తెలిపారు.  శుక్రవారం ఉదయం దేశ రాజధానిని కప్పిన దట్టమైన పొగమంచు కారణంగా పంతొమ్మిది విమానాలు రద్దు చేయబడ్డాయి, ఐదు మళ్లించబడ్డాయి మరియు 760 ఆలస్యం గా  నడిచాయి అని ఢిల్లీ  విమానాశ్రయ అధికారి ఒకరు తెలిపారు.

 

 

 

 

 

 

 

దృశ్యమానత తెల్లవారు జామున 5  గంటల 30  నిమిషాలకు  పాలం వద్ద సున్నా ఉండగా, సఫ్దర్‌జంగ్ వద్ద 300 మీటర్లు వున్నది. తర్వాత దృశ్యమానత మెరుగు పడింది.  100 కి పైగా రైళ్లు రెండు గంటల ఆలస్యంగా   నడిచాయని  రైల్వే అధికారులు తెలిపారు. శుక్రవారం గరిష్ట ఉష్ణోగ్రత 17.5 డిగ్రీల సెల్సియస్ వద్ద నమోదైంది.  తక్కువ ఉష్ణోగ్రత మరియు అధిక తేమ కారణంగా, గాలి నాణ్యత ఉదయం తక్కువగా  ఉంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సిపిసిబి) గణాంకాల ప్రకారం ఉదయం 8 గంటలకు ఢిల్లీ  లోని ఎక్యూఐ 430 వద్ద ఉంది.  డిసెంబర్ 21 వరకు భారీ వర్షం , హిమపాతం ఉంటుందని హిమాచల్ ప్రదేశ్ యొక్క కొన్ని కొండా ప్రాంతాలలో  శుక్రవారం తాజా హిమపాతం  జరిగింది.  లాహౌల్-స్పితి యొక్క పరిపాలనా కేంద్రం కీలాంగ్ లో  5 సెం.మీ మంచు  కురిసింది , తరువాత గాంధోల 3 సెం.మీ మరియు కిన్నౌర్ యొక్క కల్పా లో  1 సెం.మీ మంచు  కురిసింది. రాష్ట్రంలోని అతి శీతల ప్రదేశం కీలాంగ్, ఇక్కడ కనిష్ట స్థాయి ఉష్ణోగ్రత   మైనస్ 6 డిగ్రీల సెల్సియస్ వద్ద స్థిరపడింది. కల్పాలో కనిష్ట ఉష్ణోగ్రత 0.7 డిగ్రీల సెల్సియస్ గా వుంది.

 

 

 

 

 

 

 

 

ప్రసిద్ధ పర్యాటక కేంద్రం మనాలి 2 డిగ్రీల సెల్సియస్ కనిష్టాన్ని నమోదు చేసింది, తరువాత కుఫ్రీ 4 డిగ్రీల సెల్సియస్, డల్హౌసీ 4.3 డిగ్రీల సెల్సియస్ మరియు సిమ్లా 6.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలను  నమోదు చేసాయి. ఉత్తర భారతం వ్యాప్తంగా    జమ్మూ నగరంలో 8.2 డిగ్రీల సెల్సియస్, కత్రా, రాత్రి ఉష్ణోగ్రత 5 డిగ్రీల సెల్సియస్, శ్రీనగర్ మైనస్ 2.6 డిగ్రీల సెల్సియస్, గుల్‌మార్గ్ 6.5 డిగ్రీల సెల్సియస్, పహల్గామ్ హిల్ రిసార్ట్ మైనస్ 4.1 డిగ్రీల సెల్సియస్, హిసార్ (హర్యానా) 4.5 డిగ్రీల సెల్సియస్, కర్నల్ 5 .5 డిగ్రీల సెల్సియస్, అమృత్సర్ 7 .4 డిగ్రీల సెల్సియస్, చండీగర్ 9.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: