ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వం ఏర్పాటై ఎన్నాళ్ల‌యింద‌ని ఎవ‌రిని అడిగినా ఠ‌క్కున చెప్పే మాట ఆరు మాసాలేగా! అని . అయితే, ఈ ఆరు మాసాల్లోనే వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ తానేమిటో నిరూపించుకున్నారు. త‌న స‌త్తా ఏమిటో చూపించారు. నిజానికి ఏ పాల‌కుడికైనా కూడా ఆరు మాసాల స‌మ‌యం అంటే.. పెద్ద‌గా ప‌రిగ‌ణ‌న‌లో కి తీసుకునే ప‌రిస్థితి ఉండ‌దు. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. కొత్త‌గా ప్రారంభించిన పాల‌న‌లో అధికారులు, మం త్రుల మ‌ధ్య స‌మ‌న్వ‌యం చేసుకోవ‌డం, ప్ర‌జ‌ల నాడిని ప‌ట్టుకోవ‌డం వంటి ప‌నుల‌కే ఈ ఆరు మాసాల స మ‌యం స‌రిపోతుంది.

 

పైగా ఏపీ వంటి లోటు బ‌డ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని అర్ధం చేసుకోవ‌డం అంటే మాట‌లు కాదు. అయితే, తాను అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి కూడా సీఎం జ‌గ‌న్ త‌న స‌త్తా చాటుతున్నార‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. తొలి రోజు నుంచే ఆయ‌న సంచ‌ల‌నాల‌కు వేదిక‌లు త‌యారు చేసుకున్నారు. అవినీతి ర‌హిత పాల‌న‌కు తాను శ్రీకారం చుడుతున్నాన‌ని చెప్పిన జ‌గ‌న్‌.. రాష్ట్రంలో గ్రామ స్వ‌రాజ్యానికి వైసీపీ పునాదులు వేస్తోంద‌ని అన్నారు. అసలు ప్ర‌భుత్వ పాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు చేరువ చేస్తామ‌ని ఆయ‌న చెప్పారు.

 

ఈ క్ర‌మంలోనే స‌చివాల‌య వ్య‌వ‌స్థ‌కు నాంది ప‌లికారు. వాలంటీర్ల‌ను రంగంలోకి దింపారు. మొత్తంగా చూసుకుంటే.. ఈ వ్య‌వ‌స్థ రాక‌తో.. ప్ర‌భుత్వం నుంచి అందే ఫ‌లాలు .. ప్ర‌జ‌లకు నేరుగా చేరాల నే సంక‌ల్పానికి వాస్తవ రూపం వ‌చ్చిన‌ట్ట‌యింది. అదే స‌మ‌యంలో అన్నివిష‌యాల్లోనూ పార‌ద‌ర్శ‌క‌త‌కు పెద్ద పీట వేస్తున్నారు. త‌న కేబినెట్‌లో సోష‌ల్ ఇంజ‌నీరింగ్‌కు ప్రాధాన్యం పెంచారు. ఎస్సీ, ఎస్టీ వ‌ర్గాల‌కు ప్ర‌భుత్వ సేవ‌ల‌ను మ‌రింత‌గా చేరువ చేశారు.

 

అదే స‌మ‌యంలో మ‌హిళ‌ల‌కు మ‌రింత ర‌క్ష‌ణ క‌ల్పించేందుకు స‌రికొత్త‌గా దిశ ఏపీ-2019 చ‌ట్టాన్ని తీసుకు వ‌చ్చారు. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో.. ఆంగ్ల మాధ్య‌మాన్ని ప్ర‌వేశ పెట్ట‌డం ద్వారా పేద‌ల‌కు ఇంగ్లీష్‌ విద్య‌ను చేరువ చేయాల‌నే ద్రుఢ నిశ్చ‌యాన్ని అమలు చేస్తున్నారు. అదేస‌మ‌యంలో మ‌ద్య‌పాన నిషేధానికి కూడా నాంది ప‌లికారు. ఈ మొత్తం ప‌రిణామాల‌ను చూస్తే.. ఆరు మాసాల స‌మ‌యంలో ఇన్ని మార్పులా? అనే సందేహంతోపాటు నిజ‌మైన వాటిని చూసి నోరెళ్ల‌బెట్టే ప‌రిస్థితి కూడా ఉంది. సో.. ద‌టీజ్ జ‌గ‌న్‌!!

 

మరింత సమాచారం తెలుసుకోండి: