రాజ‌కీయాల్లో ఉన్న నాయ‌కులు మాట‌లు చెప్ప‌డంలో ఉన్న శ్ర‌ద్ధ ఆచ‌ర‌ణ‌లోకి వ‌చ్చే స‌రికిమాత్రం చూపిం చలేక పోతున్నారు. ఎన్నిక‌ల‌కు ముందు, ఎన్నిక‌ల స‌మ‌యంలోను ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల‌ను నెర‌వే ర్చ‌డంలో చాలా మంది నాయ‌కులు చ‌తికిల ప‌డుతున్న సంద‌ర్భాలు అనేకం మ‌నం చూస్తున్నాం. అయితే, వీటికి భిన్నంగా త‌న పాల‌న‌లో మెరుపు మెరిపిస్తున్నారు వైసీపీ అధినేత, సీఎం జ‌గ‌న్‌. ముఖ్యంగా సామాజి కంగా అణగారిన వ‌ర్గాల‌కు న్యాయం చేయ‌డంలో ఆయ‌న సంచ‌ల‌నాల‌ను సృష్టించారు. నిజానికి అప్ప‌టి వ‌ర‌కు కూడా ఎవ‌రూ ఊహించ‌నైనా ఊహించ‌ని విధంగా దూకుడు ప్ర‌ద‌ర్శించారు.

 

ఈ ఏడాది జూన్‌లో జ‌గ‌న్ త‌న మంత్రి విస్త‌ర‌ణ చేప‌ట్టేనాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టాక్ ఏంటో అంద‌రికీ తెలిసిందే. రాష్ట్రంలో రెడ్డి రాజ్యం ఏర్ప‌డుతుంద‌ని అంద‌రూ చెవులు కొరుక్కొన్నారు. మ‌రికొంద‌రు వాదిం చారు కూడా. అయితే, అనూహ్యంగా అప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ క‌నీసం ఊహ‌కు సైతం ఆలోచ‌న చేయ‌లేనివిధం గా ఏకంగా ఐదు సామాజిక వ‌ర్గాల‌కు ఐదు డిప్యూటీ ముఖ్య‌మంత్రుల ప‌ద‌వుల‌ను ఇచ్చేశారు జ‌గ‌న్‌. ఈ ప‌రిణామం అనూహ్యం.. అపూర్వం అంటూ జాతీయ మీడియా జ‌గ‌న్‌ను ఆకాశానికి ఎత్తేసింది. ఇక‌, అదేస‌మ యంలో ఎవ‌రైతే.. ఎక్కువ‌గా ఊహించుకున్నారో.. రెడ్డి వ‌ర్గానికి నామ మాత్రంగానే ప్రాధాన్యం ఇచ్చారు.

 

ఇక‌, ఎస్సీ, ఎస్టీ, బీసీల‌తోపాటు మైనార్టీ వర్గాల‌కు, మ‌హిళ‌ల‌కు కూడా జ‌గ‌న్ అత్యున్న‌త ప్రాధాన్యం ఇచ్చా రు. ముఖ్యంగా హోం శాఖ‌ను ఎస్సీ వ‌ర్గానికి చెందిన సుచ‌రిత‌కు క‌ట్ట‌బెట్ట‌డం, ఉమ్మ‌డి రాష్ట్ర చ‌రిత్ర‌లోనే కాకుండా విభ‌జ‌న త‌ర్వాత ఏపీలోనూ రికార్డుగా మారిపోయింది. అదేస‌మ‌యంలో నామినేటెడ్ ప‌ద‌వుల్లోనూ మ‌హిళ‌ల‌కు 50శాతం రిజ‌ర్వేష‌న్‌లు క‌ల్పిస్తూ.. తీసుకున్న నిర్ణ‌యం కూడా జ‌గ‌న్ ఖ్యాతిని అంబ‌రానికి చేర్చింది. త‌న మంత్రి వ‌ర్గం దేశంలోని ఇత‌ర రాష్ట్రాల మంత్రి వ‌ర్గాల‌కు ఆద‌ర్శంగా ఉండాల‌నే ఏకైక ల‌క్ష్యంతో ముందుకు సాగిన జ‌గ‌న్ విష‌యంలో వంక పెట్టే సాహ‌సం కూడా ఎవ‌రూ చేయ‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డడం గ‌మ‌నార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: