దిశ హత్యాచార నిందితుల కుటుంబ సభ్యుల్లో మిగిలిన వారి సంగతేమో కానీ... చెన్నకేశవులు భార్య మాత్రం బాగా వార్తల్లో ఉంటోంది. ఎన్ కౌంటర్ జరిగిన రోజే భర్త శవం కోసం ఆమె ధర్నా చేసింది. ఈ దేశంలో రేప్ చేసిన అందర్నీ ఇలాగే చంపేస్తారా.. అంటూ నిలదీసింది. ఆ తరవాత తనకు 25 లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసింది.

 

ఇప్పుడు చెన్న కేశవులు భార్య గురించి మరో సంచలన విషయం వెలుగు చూసింది. అదేమిటంటే..  ఆమె మైనరు అని తేలింది. అంతే కాదు.. ఆమె వయసు కేవలం 13 ఏళ్ళే నట.నారాయణపేట జిల్లా బాలల సంరక్షణ విభాగం శుక్రవారం ఆమె గ్రామంలో ప్రాథమిక విచారణ జరిపింది. చెన్న కేశవులు భార్యకు సంబంధించిన వివరాలను పాఠశాల నుంచి సేకరించారు. 

 

స్కూల్ రికార్డ్స్ ప్రకారం.. ఆమె  వయసు 13సంవత్సరాల ఆరు నెలలు. ఎందుకంటే చెన్న కేశవులు భార్య జన్మదినం: 15-06-2006. అంతే కాదు... ప్రస్తుతం ఆమె 6 నెలల గర్భవతి కూడా.  చెన్నకేశవులు తల్లిదండ్రులతో అధికారులు మాట్లాడారు. బాలికకు 18 ఏళ్లు వచ్చే వరకు బాలల సదనంలో రక్షణ కల్పిస్తామని వారి దృష్టికి తీసుకెళ్లారు. దీనికి వారు అంగీకరించలేదు. 

 

 

చెన్న కేశవులు భార్యకు తల్లిదండ్రులు లేకపోవడంతో చిన్నప్పటి నుంచి బాబాయి, నాయనమ్మ వద్ద ఉండేది. చెన్నకేశవులును ప్రేమ వివాహం చేసుకున్న తరువాత అత్తగారింటికి వచ్చింది. చెన్న కేశవులు భార్యకు మరో చెల్లెలు, తమ్ముడు ఉన్నారు. ప్రసుత్తం వారిద్దరు బాబాయి ఇంట్లో ఉంటున్నారు. వారినైనా సంరక్షణ కేంద్రానికి పంపిస్తారా అని అడిగారు. 

 

 

చెన్న కేశవులు భార్య చెల్లెలు తమ వద్దే ఉంటుందని, తమ్ముడిని సంరక్షణ కేంద్రానికి పంపిస్తానని వారి బాబాయి తెలిపారు. దీనిపై ప్రాథమిక నివేదికను తయారు చేశామని, దానిని ఉన్నతాధికారులకు పంపిస్తామని జిల్లా బాలల సంరక్షణాధికారి రాములు తెలిపారు.

 

 

దిశ అత్యాచార ఘటన.. చికిత్స నిమిత్తం బయటకు వెళ్లిన వెటర్నరీ డాక్టర్ దిశను నలుగురు లారీ డ్రైవర్లు కలిసి సామూహిక అత్యాచారం చేసి హత్య చేసి పెట్రోల్ పోసి ఆమె శవాన్ని ముట్టుకొనేకి కూడా లేకుండా పెట్రోల్ పోసి కాల్చిపడేశారు ఆ నీచులు. అయితే ఆ నీచులను కేవలం 24 గంటల్లోనే పోలీసులు పట్టుకున్నారు. 

 

 

దీంతో ఆ నిందితులను కోర్టులో హాజరుపరచగా ఆ నిందితులను 14రోజులు రిమాండ్ లో ఉంచాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే విచారణలో భాగంగా ఆ నీచులను సిన్ రికర్రెక్షన్ కోసం ఘటన స్థలంలోకి తీసుకురాగా ఆ సమయంలో ఆ నిందితులు పారిపోవాలని చూసి పోలీసులపై దాడి చెయ్యడం వల్ల పోలీసులు ఆత్మరక్షణ కోసం ఆ నిందితులపై కాల్పులు జరిపారు. దీంతో ఆ నిందితులు నలుగురు ఈ నెల 6వ తేదీన తెల్లవారుజామున ఉదయం 5 గంటలకు మృతిచెందారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: