అవును! రాజ‌కీయాల్లో ముఖ్యంగా తెలుగు రాజ‌కీయాల్లో రెండే రెండు సార్లు ప్రభంజ‌నాలు ఏర్ప‌డ్డాయి. వాటి లో ప్ర‌ధానంగా.. తెలుగువారి తెర‌వేల్పు నంద‌మూరి తార‌క‌రామారావు ఉర‌ఫ్ ఎన్టీఆర్‌.. తెలుగు వారి ఆత్మ‌గౌర వ నినాదంతో టీడీపీని స్థాపించిన‌ప్పుడు ఉమ్మ‌డి ఏపీలో రాజ‌కీయ ప్ర‌భంజ‌నం ఏర్ప‌డింది. అప్ప‌టి ఎన్నిక ల్లో ఎన్టీఆర్ విజ‌యం సాధించారు. ప్ర‌జ‌లు క్షేత్ర‌స్థాయి నుంచి కూడా ఆయ‌న‌కు జేజేలు ప‌లికారు. ఇక‌, అ లాంటి ప్ర‌భంజ‌న‌మే అదే ఉమ్మ‌డి రాష్ట్రంలో జ‌గ‌న్ సృష్టించిన ప్ర‌భ‌జ‌నం.

 

నాడు ఏ కాంగ్రెస్‌కు వ్య‌తిరేకంగా  టీడీపీ ఆవిర్భ‌వించిందో.. జ‌గ‌న్ కూడా అదే కాంగ్రెస్‌ను ఎదిరిస్తూ.. వైసీపీని ఏర్పాటు చేయ‌డం ప్ర‌భంజ‌నం గా రికార్డు సృష్టించింది. ఉమ్మ‌డి రాష్ట్రంలో దాదాపు 12 మంది ఎమ్మెల్యేల‌ను ఆయ‌న వైసీపీ పార్టీ జెండా పై ఉప ఎన్నిక‌ల్లో గెలిపిం చుకున్నారు. నిజానికి జ‌గ‌న్ స్థాపించిన పార్టీ ఎన్నాళ్లు ఉంటుందిలే.. ఏదో ఒక‌నాడు కాంగ్రెస్లో విలీనం ఖా య‌మ‌ని అంద‌రూ అనుకున్నారు. అయితే, అనూహ్యంగా రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ఏపీలో పార్టీని ముం దుం డి న‌డిపించారు.

 

అధికారంలోకి తీసుకురావ‌డ‌మే ప‌ర‌మావ‌ధిగా జ‌గ‌న్ పాద‌యాత్ర చేశారు. ఈ యాత్ర కూ డా గతంలో ఆయ‌న తండ్రి వైఎస్ చేసిన పాద‌యాత్ర‌ను మించి ఉండ‌డం, ప్ర‌జ‌లు ఎక్క‌డిక‌క్క‌డ బ్ర‌హ్మ ర‌థం ప‌ట్ట‌డం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఆయ‌న సుదీర్గ రాజ‌కీయ అనుభ‌వం, దాదాపు  14 ఏళ్ల‌పాటు సీ ఎంగా ఉన్న చంద్ర‌బాబును మ‌ట్టిక‌రిపించి ప్ర‌భంజ‌నం సృష్టించారు. ఇక‌, ఏపీలో పాల‌నా ప‌రంగా చూసుకున్నా.. జ‌గ‌న్‌కు మంచి మార్కులే ప‌డుతున్నాయి. అధికారంలోకి వ చ్చి కేవలం ఆరు మాసాలే అయినా కూడా జ‌గ‌న్ త‌న‌దైన శైలిలో దూసుకు పోతున్నారు.

 

అనేక సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుని ఎన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చినా.. ప్ర‌జ‌లు స్వాగ‌తిస్తుంటే.. ఆయ‌న ముందుకే వెళ్తున్నారు. ఇలా అటు రాజ‌కీయంగాను ఇటు పాల‌న ప‌రంగా కూడా జ‌గ‌న్ ప్ర‌భంజ‌నం సృష్టిస్తున్నారు. గ‌తంలో లేని విధంగా రాష్ట్రంలో రాజ‌కీయాలు చేస్తూ.. ప్ర‌జ‌ల కు ప్ర‌భుత్వాన్ని ద‌గ్గ‌ర చేస్తుండ‌డం, ప్ర‌తి ఒక్క‌రితోనూ భేష్ అని అనిపించుకోవ‌డం స‌రికొత్త ప్ర‌భంజ‌న‌మే అవుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

మరింత సమాచారం తెలుసుకోండి: