జ‌గ‌న్ టీమ్‌కు అన్ని రూపాల్లోనూ ప్ర‌శంస‌లు ద‌క్కుతున్నాయి. నాయ‌కుడికి త‌గిన గ‌ణంగా మంత్రుల‌కు విమ‌ర్శ‌కుల నుంచి కూడా ప్ర‌శంస‌లు ద‌క్కుతున్నాయి. ఆయ‌న ఆచితూచి ఏర్పాటు చేసుకున్న మంత్రి వ‌ర్గ బృందం.. జ‌గ‌న్ అడుగు జాడ‌ల్లో న‌డుస్తూ.. నాలుగు అడుగులుముందుకు వేస్తుండ‌డాన్ని ప్ర‌జ‌ల నుంచే కాకుండా మేధావి వ‌ర్గాల నుంచి ప్ర‌శంస‌లు వ‌చ్చేలా చేస్తోంది. విష‌యంలోకి వెళ్తే.. మొత్తం పాతిక మంది మంత్రుల‌ను జ‌గ‌న్ త‌న కేబినెట్‌లో నియ‌మించుకున్నారు.

 

వీరిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వ‌ర్గాల‌కు ప్ర‌ధానంగా ప్రాధాన్యం క‌ల్పించారు. దీంతో ఆదిలోనే ఆయ‌న‌పై ప్ర‌శంసల జ‌ల్లు కురిసింది. ఇక‌, తాజాగా జ‌రిగిన అసెంబ్లీ స‌మావేశాల్లోనూ ఈ టీమ్ త‌మ‌ను తాము నిరూపించుకుంది. ఏ విష‌యంపైనైనా నాయ‌కులు అద్య‌య‌నం చేసి రావాల‌నే జ‌గ‌న్‌ సూచ‌న‌లను తూ.చ త‌ప్పకుండా పాటిస్తున్నారు. ఏ అంశం తీసుకున్నా.. గ‌తంలో ఏం జ‌రిగింది.. భ‌విష్య‌త్తులో తామేం చేస్తాం.. అనే విష‌యాల‌పై మంత్రులు కూలంక‌షంగా ప‌రిస్తితిని అర్ధం చేసుకుని స‌భ‌లో వివ‌రించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. దీంతో స‌భ‌లో ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించాల‌ని భావించిన టీడీపీ కూడా చ‌తికిల ప‌డుతోంది.

 

విష‌యం ఏదైనా.. ఏ సంద‌ర్భ‌మైనా.. పూర్తి అవ‌గాహ‌న‌, స‌బ్జెక్ట్‌తో వైసీపీ మంత్రులు స‌భ‌లో వివ‌రించిన తీరు కు మంచి మార్కులు పడుతున్నాయి. అదేస‌మ‌యంలో స‌బ్జెక్ట్ ఏదైనా సీఎంగా తాను కూడా వివ‌ర‌ణ ఇచ్చేందుకు ప్ర‌తిప‌క్షం ప్ర‌శ్నల‌ను తిప్పికొట్టేందుకు ప్ర‌య‌త్నించ‌డం ఈ విష‌యంలో స‌క్సెస్ కావ‌డం కూడా గ‌మ‌నార్హం. ఇక‌, ఎమ్మెల్యేలు, మంత్రుల విష‌యంలోనూ జ‌గ‌న్ దూకుడు స‌క్సెస్ అవుతోంది. ప్ర‌తి ఒక్క‌రూ ఏదో ఒక అంశంతో అసెంబ్లీకి రావాల‌ని ఆయ‌న చేసిన సూచ‌న‌లు స‌భ‌లో క‌నిపిస్తున్నాయి. ప్ర‌తి ఎమ్మెల్యే కూడా వ్యూహాత్మ‌కంగా త‌మ త‌మ నియోజ‌క‌వర్గా ల్లోని స‌మ‌స్య‌లు వివ‌రించ‌డంలోనూ దూకుడుగా ఉన్నారు.

 

అదే స‌మ‌యంలో మంత్రుల‌తో స‌మానంగా ఎమ్మెల్యేలు కూడా ప్ర‌తిప‌క్షం దూకుడుకు ముకుతాడు వేయ‌డంలోనూ స‌క్సెస్ అవుతున్నారు. ఇక‌, ఎంపీల విష‌యానికి వ‌స్తే.. కేంద్రం వ‌ద్ద ఏపీ స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావించ‌డంలోను, వాటికి స‌రైన విధంగా ప‌రిష్కారాలు తీసుకురావ‌డంలోనూ కూడా జ‌గ‌న్ స‌క్సెస్ అవుతున్నా ర‌ని అంటున్నారు. మొత్తంగా చూస్తే.. జ‌గ‌న్ టీమ్ సూప‌ర్ స‌క్సెస్ అనే నినాదం స‌ర్వ‌త్రా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: