కేవ‌లం ఏడు రోజులు.. 48 గంట‌లు..! వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ స‌త్తా ఏంటో ఏపీకి తెలిసిపోయింది! ఇదే ఇప్పుడు ఏ ఇద్ద‌రు క‌లి సినా చ‌ర్చించుకుంటున్న ప్ర‌ధాన విష‌యం. అదేస‌మ‌యంలో ఫార్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీగా చెప్పుకొనే చంద్ర‌బాబుకు మైన‌స్ మార్కులు ప‌డిపోతున్నాయి. విష‌యంలోకి వెళ్తే.. ఈ ఏడాది శీతాకాల అసెంబ్లీ స‌మావేశాలు ఏడు రోజులు, గ‌రిష్టంగా 48 గంట‌ల పాటు నిర్వ‌హించారు. ఈ స‌మావేశాల్లో గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా సీఎం జ‌గ‌న్ త‌న విశ్వ‌రూపం చూపించారు.

 

ఒక‌టి.. మ‌హి ళ‌ల‌పై జ‌రుగుతున్న అకృత్యాల‌ను అడ్డుకునేందుకు ఉద్దేశించిన దిశ చ‌ట్టం తీసుకురావ‌డం, రెండు ఏపీ రాజ‌ధాని విష‌యం లో త‌న మ‌న‌సులోని మాటను ఎలాంటి జంకూ లేకుండా చెప్పేయ‌డం. ఈ ప‌రిణామంతో వైసీపీలో దూకుడు ఓ రేంజ్‌లో పెరిగిపోగా.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ రేటింగ్ మ‌రింత ప‌డిపోయింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. కీల‌క‌మైన బిల్లులు నిజానికి ఇప్పుడు వ‌చ్చినవి కాదు. గ‌తంలో చంద్ర‌బాబు హ‌యాంలోనే ఒకింత శ్ర‌ద్ధ తీసుకుని ఉంటే.. వాటిని ప్ర‌వేశ పెట్టేందుకు అవ‌కాశం ఉంది.

 

ఇప్పుడు ఇదే విష‌యంపై టీడీపీ శ్రేణులు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నాయి. ప్ర‌ధానంగా ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ఆంగ్ల మాధ్య‌మం ప్ర‌వేశ పెట్ట‌డం అనేది చంద్ర‌బాబు హ‌యాంలోనే తీసుకున్న నిర్ణ‌యం. అయితే, అప్ప‌ట్లో ఆయ‌న వెన‌క్కి త‌గ్గారు. ఫ‌లితంగా కేవ‌లం 34 శాతానికే ప‌రిమిత‌మైంది. ఇక‌, ఇప్పుడు జ‌గ‌న్ ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా కూడా దీనిని అమ‌లు చేసేందుకు యుద్ధ ప్రాతిప‌దిక‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఇక‌, దిశ ఘ‌ట‌న విష‌యంలో తీసుకు వ‌చ్చిన చ‌ట్టం కూడా జ‌గ‌న్‌కు భారీ రేటింగ్ పెంచింది. ఇప్ప‌టికే ఒడిసా స‌హా ఢిల్లీ, హ‌రియాణా, తెలంగాణ రాష్ట్రాలు దీనిపై దృష్టి పెట్టాయి.

 

ఇక‌, అత్యంత కీల‌క‌మైన రాజ‌ధాని నిర్మాణం విష‌యంలో జ‌గ‌న్ ఆఖ‌రి రోజు అసెంబ్లీలో చేసిన ప్ర‌క‌ట‌న మ‌రింత సంచ‌ల‌నంగా మారింది. అభివృద్ది వికేంద్రీక‌ర‌ణ సూత్రాన్ని తాను తూచ త‌ప్ప‌కుండా అమ‌లు చేయాల‌ని భావించిన జ‌గ‌న్ సీమ‌, కోస్తా, ఉత్త‌రాంధ్రల‌కు న్యాయం చేసే దిశ‌గా అడుగులు వేశారు. ఇది ఒక‌ర‌కంగా వ్య‌క్తిగ‌తంగా జ‌గ‌న్‌కు, రాజ‌కీయంగా ఆయ‌న పార్టీకి మేలు చేసే చ‌ర్య‌లే అవుతాయ‌నేది మేధావుల మాట‌. దీంతో ఇప్పుడు అంద‌రి దృష్టీ ఫార్టీ ఇయ‌ర్స్ ఇండస్టీ.. చంద్ర‌బాబుపై ప‌డింది. ఆయ‌న ప‌రిస్థితి ఏంటి? ఆయ‌న డీలా ప‌డ్డారా? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: