తెలుగు రాష్ట్ర చరిత్రలో ఓ రాజకీయ పార్టీ పెట్టి అఖండ విజయం సాధించడమంటే ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీనే గుర్తొస్తుంది తెలుగు ప్రజలకు. అంతటి రికార్డును మళ్లీ ఓ రాజకీయ పార్టీ సృష్టిస్తుందా అనే అనుమానాలకు తెర దించిన పార్టీ వైఎస్సార్సీపీ. ఏ రాజకీయ నాయకుడూ ఢీ కొట్టడానికే భయపడిన కాంగ్రెస్ అధినాయకత్వాన్నే ప్రశ్నించి సొంతంగా పార్టీ పెట్టుకున్న జగన్ పదేళ్ల పాటూ ఆ పార్టీని నడిపించుకున్నాడు. సొంతంగా పార్టీని స్థాపించుకుని, అలుపెరగని పోరాటం సాగిస్తూ ఎన్నో సవాళ్లను ఎదుర్కొని నిలవడం గొప్ప విషయం. ఇది సువర్ణాక్షరాలతో లిఖించిన చరిత్ర కాక మరేంటి?

 

 

తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీరామారావు నుంచి అనూహ్య పరిణామాల మధ్య అధికారాన్ని చేజిక్కించుకున్నారు చంద్రబాబు. అయితే.. టీడీపీ అంతా నాదే అన్నట్టుగా వ్యవహరించడం అందరికీ తెలిసిందే. ఆ తీరే మొన్నటి ఎన్నికల్లో ఘోర పరాజయానికి దారి తీసింది. నేటి రోజుల్లో ఓ పార్టీని స్థాపించి దానిని అధికారంలోకి తీసుకురావటమంటే సామాన్యమైన విషయం కాదు. ఎన్నో ఆటుపోట్లు, సవాళ్లు, ప్రతిబంధకాలు ఎదురవుతాయి. వాటన్నింటినీ తట్టుకుని నిలబడగల ధైర్యం ఉన్నవాడే ఈ రంగంలో నిలబడతాడు. తనను నమ్మి ప్రయాణించిన నాయకులు, కార్యకర్తలే ఆలంబనగా జగన్ పదేళ్ల ప్రయాణం ఎవరికైనా ఓ గ్రంధం అనే చెప్పాలి.

 

 

పార్టీని వారసత్వంగా కానీ.. అవకాశవాదంతో కానీ తీసుకుని ప్రయాణం సాగించడం వేరు. కానీ సొంతంగా పార్టీ పెట్టుకుని ప్రజల్లో గెలవడం.. అదీ ఓ మహాద్భుత విజయం సాధించడమంటే చరిత్రలో లిఖించే విజయమనే చెప్పాలి. జగన్ స్థాపించిన పార్టీని జనం నమ్మారు. వక్రమార్గంలో వచ్చి అధికారం చెలాయించకుండా నికార్సయిన విజయంతో సాధించిన విజయం తెలుగు రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతుందనే చెప్పాలి. ఎవరో పెట్టిన పార్టీని నమ్ముకుని అధికారంలోకి రాకుండా.. సొంతంగా నిలవడం అధికారం పొందడం నిజంగా ఓ చరిత్ర.

మరింత సమాచారం తెలుసుకోండి: