ఆనాడు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి ఉన్నప్పుడు... ప్రజాసంక్షేమం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం పాటు పడ్డారు. ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకువచ్చి పేద ప్రజలకు న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకున్నారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి. విద్య వైద్యం విషయంలో పేద ప్రజలకు ఎక్కడ అన్యాయం జరగకూడదనే ఉద్దేశ్యంతో ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కనీస వైద్యం కూడా చేయించుకోలేని పేదప్రజలకు మెరుగైన వైద్యం అందించడం ద్వారా ఆరోగ్యంగా ఉంచాలనే ఉద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ పథకానికి ఊపిరి పోశారు. ఆనాడు వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ పథకం ద్వారా... ఎంతోమంది పేద ప్రజలు లబ్ధి పొందారు. 

 

 

 ఇక ఇప్పుడు తండ్రి ఎజెండాను నిలబెట్టడానికి.. తండ్రి ద్యేయన్ని  ముందుకు నడిపించడానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి వారసుడిగా వైసిపి పార్టీ తాపించి ముందుకు నడిచారు జగన్మోహన్ రెడ్డి. 2019 ఎన్నికల్లో భారీ మెజారిటీతో సొంతం చేసుకుని ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇక జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా తండ్రి బాటలోనే నడిచారు . పేద ప్రజలకు మెరుగైన విద్య వైద్యం అందించేందుకు నడుంబిగించారు. ఈ క్రమంలోనే తన తండ్రి హయాంలో ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకానికి మరోసారి ఊపిరి పోసి ... పేద ప్రజలందరికీ అన్నగా అండ దండ గా  నిలిచారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. 

 

 

 

 ఒకప్పటి కంటే మెరుగైన వైద్య సదుపాయాలతో ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టారు. రెండువేల వ్యాదులను ఆరోగ్యశ్రీ పథకానికి అనుసంధానం చేస్తూ పేద ప్రజలు వైద్యం చేయించుకోవడానికి డబ్బులు లేక ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ముందుకు సాగారు జగన్మోహన్ రెడ్డి. ఆరోగ్యశ్రీ పథకానికి రెండువేల వ్యాధులు అనుసంధానం చేయడంతో పాటు... వెయ్యి రూపాయల ఖర్చు కంటే ఎక్కువ అయినా దానిని ఆరోగ్య శ్రీ పరిధిలోకి వచ్చేలా  ఈ నిర్ణయం తీసుకున్నారు. విష జ్వరాలను సైతం ఆరోగ్య శ్రీ పరిధిలోకి తెచ్చి పేద ప్రజలు అందరికీ అండగా నిలిచారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇక అంతే కాకుండా ఆరోగ్యశ్రీ ద్వారా మెరుగైన వైద్యం అందించేందుకు హైదరాబాద్ చెన్నై బెంగళూరు లోని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కు కూడా ఆరోగ్యశ్రీని అనుసంధానం చేశారు. దీని ద్వారా పెద్ద పెద్ద హాస్పిటల్లో సైతం పేద ప్రజలు మెరుగైన వైద్య సేవలు పొందడానికి వీలు ఉంటుంది. ఇలా తండ్రి బాటలో నడిచిన తనయుడు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆరోగ్యశ్రీకి పెద్ద పీట వేశారు

మరింత సమాచారం తెలుసుకోండి: