వైసీపీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రిగా జగన్ పదవి బాధ్యతలు చేపట్టాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలనను గాడిలో పడిందని  రాజకీయ విశ్లేషకుల భావన. జగన్మోహన్ రెడ్డి  అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో వినూత్న పథకాలను ప్రవేశపెడుతూ అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేస్తూ ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా బడుగు బలహీనవర్గాల అభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. మాట తప్పని మడమ తిప్పని సీఎంగా అధికారంలోకి వచ్చిన ఆరు నెలల పాలన లోనే ఎన్నికల ముందు ఇచ్చిన ఎన్నో హామీలను నెరవేరుస్తూ.. ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. రొటీన్గా కాకుండా కాస్త భిన్నంగా ఆలోచిస్తూ ఎన్నో వినూత్న నిర్ణయాలు తీసుకొని... ఇతర రాష్ట్రాలకు సైతం ఆదర్శంగా నిలుస్తున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. 

 

 

 ఈ క్రమంలోనే రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ అవసరమని... అందువల్ల రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేసే అవకాశం ఉందంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా వ్యాఖ్యానించారు. అయితే రాజధాని అధ్యయనంపై ప్రభుత్వం నియమించిన జిఎన్ రావు కమిటీ కూడా జగన్ నిర్ణయాన్ని సమర్ధిస్తూ  నివేదిక ఇచ్చినట్లు సమాచారం. కర్నూలు విశాఖ అమరావతిలో మూడు రాజధానులు కొనసాగించాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో అభివృద్ధి ఒక చోట కాకుండా రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో ముందుచూపుతో జగన్ 3 రాజధానిల నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

 

 

 అయితే జగన్ తీసుకున్న 3 రాజధానిల నిర్ణయంపై ప్రతిపక్షాలు అమరావతి రైతులందరూ తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే మొదటి నుంచి సీఎం జగన్  ప్రతిపక్షాల నుంచి ఎన్ని విమర్శలు ఎదురైనప్పటికీ తాను చేయాలనుకున్నది చేస్తూ ముందుకు సాగుతున్నారు . ఈ క్రమంలోనే రాజధాని విషయంలో కూడా అలాగే చేసే అవకాశం ఉంది. కాగా కర్నూలు విశాఖ అమరావతిలో 3 రాజధానిల కొనసాగించి... ఒకవేళ సక్సెస్ సాధిస్తే మాత్రం ఇక జగన్ ప్రభుత్వానికి తిరుగు లేదని చెప్పాలి. మన దేశంలో ఇప్పటి వరకు మూడు రాజధానిలు  ఉన్న రాష్ట్రంగా ఏ రాష్ట్రం లేదు. ఏపీ సీఎం జగన్ రాజధానిపై ముందుచూపుతో వినూత్న ఆలోచన చేసి  3 రాజధానిల  ఏర్పాటుకు నిర్ణయించిన నేపథ్యంలో... ఒకవేళ ఈ మూడు రాజధానిల నిర్ణయం సక్సెస్ అయితే  మాత్రం.. సీఎం జగన్ కొత్త చరిత్ర సృష్టించినట్లే  అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: