అత్యంత శక్తిమంతమైన సీఈవోల్లో సుందర్ పిచాయ్ కూడా ఒకరన్న విషయం అందరికీ తెలిసిందే. అలాంటి  అల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ ఏడాది జీతమెంతో తెలుసా ? సుమారుగా  240 మిలియన్ డాలర్లట. అంటే మన కరెన్సీలో అయితే సుమారు రూ. 1700 కోట్లు.  అత్యంత శక్తిమంతమైన సాంకేతిక దిగ్గజాల్లో  ఒకడైన సుందర్ పిచాయ్ అతిపెద్ద స్టాక్ అవార్డును అందుకోబోతున్నారు.

 

రాబోయే మూడేళ్ళు పనితీరు ఆధారిత స్టాక్ అవార్డు  రూపంలో  240 మిలియన్ డాలర్లను సంవత్సరానికి  వేతనంగా అందుకోబోతున్నారు. అలాగే 2020 నుండి  పిచాయ్ అందుకోబోతున్న ఏడాది జీతం 20 లక్షల డాలర్లని సమాచారం.  ఈ విషయాన్ని ఆల్ఫాబెట్ విడుదల చేసిన  రెగ్యులేటరీ ఫైలింగ్ లో స్పష్టం చేసింది. అందుకనే పిచాయ్ వార్షిక వేతనం విషయం బయటపడింది.

 

ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా జీతాలు తీసుకునే సీఈవోల్లో సుందర్ పిచాయ్ కూడా ఒకరన్న విషయం కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.  గూగుల్ లో ఉన్నపుడు సుందర్ అందుకున్న ఏడాది జీతం రూ. 1300 కోట్లు.  గూగుల్ చీఫ్ గా పిచాయ్ బాధ్యతలు స్వీకరించినపుడు సంవత్సరానికి  6, 52, 500 డాలర్లకు పెరిగింది.  వెంటనే అంటే మరుసటి ఏడాదే ఆయన జీతం పెరిగిపోయింది. గూగుల్ సంస్ధ నుండి  199 మిలియన్ డాలర్ల స్టాక్ అవార్డును అందుకున్నారట.

 

అల్ఫాబెట్ అనే సంస్ధకు గూగుల్ మాత్రసంస్ధ అన్న విషయం అందిరికీ తెలిసిందే.  వ్యవస్ధాపకులు లారీపేజ్,  సెర్గీబ్రిన్ లు ఈ సంస్ధను ఏర్పాటు చేసిన 21 ఏళ్ళ తర్వాత రిటైర్ అయిన కారణంగా సుందర్ సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు.  బాధ్యతలు స్వీకరించగానే ప్రపంచంలోని అత్యంత శక్తిమంతులైన సీఈవోల జాబితాలో పిచాయ్ కూడా చేరిపోయారు.  ఈక్విలార్ ప్రకారం అమెరికాలోని అతిపెద్ద సంస్ధల్లో  ఒకటైన మిడియాన్ అనే సంస్ధ సీఈవో వార్షిక వేతనం 1.2 మిలియిన్ డాలర్లు. పిచాయ్ స్పీడ్ చూస్తుంటే మిడియాన్ సీఈవొ జీతాన్ని తొందరలోనే దాటేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: