హైదరాబాద్ షాద్నగర్లో వైద్యురాలు దిశా అత్యాచార హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నలుగురు నిందితుల ఎన్ కౌంటర్లపై విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. నిందితుల ఎన్కౌంటర్ జరిగి  16 రోజులు అవుతున్నప్పటికీ పోలీసులు విచారణ మాత్రం  ఓ కొలిక్కి రాలేదు. అయితే నాలుగు మృతదేహాలను   సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గాంధీ ఆస్పత్రిలో భద్ర పరిచిన విషయం తెలిసిందే. మృతదేహాలు కుళ్ళి పోకుండా ఉండేందుకు ఎంబాజింగ్  ప్రక్రియను ఉపయోగిస్తున్నారు  వైద్యులు. అయితే దిశా  నిందితులు ఎన్కౌంటర్ ను  తప్పుబడుతూ హైకోర్టులో దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు నలుగురు నిందితులను మృతదేహాలను పోస్టుమార్టం చేయాలని భావించింది. 

 

 

 

దీంతో మృతదేహాల పరిస్థితుల గురించి గాంధీ ఆసుపత్రి సూపర్-ఇండెంట్  ను వివరాలు అందించాల్సిందిగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో హై కోర్టులో హాజరైన గాంధీ ఆసుపత్రి సూపర్-ఇండెంట్ దిశా  హత్య కేసులో నిందితుల మృతదేహాలు మరో వారం రోజుల కంటే ఎక్కువ కాలం ఉండే అవకాశం లేదని హైకోర్టులో తెలిపారు. మార్చురీలో మైనస్  4 డిగ్రీల ఉష్ణోగ్రతలో మృతదేహాలను భద్రపరచామని... అయినప్పటికీ నలుగురు నిందితులు మృతదేహాలు ఇప్పటికే 50 శాతం కూలిపోయాయని  గాంధీ ఆసుపత్రి సూపరిండెంట్ హైకోర్టులో తెలిపారు. ఇప్పటికే మృతదేహాలకు కుళ్ళి పోకుండా ఉండేందుకు ఎంబాజింగ్  ప్రక్రియ నిర్వహిస్తున్నామని తెలిపారు. మరో వారం రోజుల పాటు మాత్రమే మృతదేహాలు కుళ్ళిపోకుండా ఉండే అవకాశం ఉందని తెలిపారు. 

 

 

 

 మరో వారం రోజుల్లో మృతదేహాలు 100% కుళ్ళిపోయే అవకాశం ఉందని సూపరిండెంట్ హైకోర్టులో వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా జోక్యం చేసుకున్న న్యాయమూర్తి మృతదేహాలు పాడవకుండా ఉండేందుకు మరో చోట భద్రపరిచే అవకాశం ఉందా అని ప్రశ్నించగా... తనకు అలాంటి వివరాలు తెలియని గాంధీ ఆసుపత్రి సూపర్-ఇండెంట్ శ్రవణ్ తెలిపారు. కాగా సుప్రీం కోర్టు నియమించిన కమిటీ దిశా  నిందితుల ఎన్కౌంటర్ పై  విచారణ పూర్తి చేసేంతవరకు నిందితులను మృత దేహాలను గాంధీ ఆస్పత్రిలోనే భద్రపరచాలని ఆదేశించిన విషయం తెలిసిందే. అటు నిందితుల కుటుంబీకులకు కూడా తమ వారి మృతదేహాలను అప్పగించండి అంటూ అధికారులను వేడుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: