ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు పార్టీ కార్యకర్తలు నాయకులతో పాటు  సామాన్య ప్రజలు కూడా చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. తండ్రి చనిపోయిన నాటినుండి ప్రజలమధ్య ఉంటూ ప్రజల బాగోగుల కోసం అనేక పోరాటాలు పోరాడి చివరాఖరికి తన కలను సాకారం చేసుకున్న వైయస్ జగన్ ఈరోజు అనగా డిసెంబర్ 21న పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వ అధికారులతో పాటు పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు జగన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ బొకేలు అందిస్తున్నారు.

 

ఈ నేపథ్యంలో తన పుట్టినరోజు నాడు ముఖ్యమంత్రి వైయస్ జగన్ బంగారం లాంటి శుభవార్త ప్రకటించడం జరిగింది. విషయంలోకి వెళితే ఇటీవల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలలో ఏపీఎస్ ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం అసెంబ్లీలో ప్రభుత్వంలో విలీనం అయినట్లు ఆమోదం పొందినట్లు ఇటీవల స్పీకర్ ప్రకటించగా తాజాగా మరొక గుడ్ న్యూస్ ఆర్టీసీ కార్మికులకు జగన్ సర్కార్ తెలపడం జరిగింది.

 

విషయంలోకి వెళితే ఆర్టీసీ కార్మికులకు సంక్రాంతిపండుగ అడ్వాన్స్ చెల్లించేందుకు నిధులు మంజూరు చేస్తూ కీలక‌ నిర్ణ‌యం తీసుకుంది. అడ్వాన్స్ కోసం రూ.19 కోట్లు మంజూరు చేసిన‌ట్లు ఆర్టీసీ యాజ‌మాన్యం ప్ర‌క‌టించింది. వ‌చ్చే నెల 1న డిసెంబ‌ర్ వేత‌నంతో క‌లిపి అడ్వాన్స్ చెల్లించాల‌ని ఆర్టీసీ కృష్ణ‌బాబు ఉత్త‌ర్వులు జారీ చేశారు. కేట‌గిరిల వారీగా అడ్వాన్స్ మొత్తం అందించ‌నున్నారు.

 

క్లాజ్ 3 కేట‌గిరి ఉద్యోగుల‌కు రూ.4,500లు, క్లాజ్ 4 కేట‌గిరి ఉద్యోగుల‌కు రూ.4వేలు అడ్వాన్స్‌గా ఇవ్వ‌నున్నారు. పండుగ స‌మ‌యంలో ఇచ్చిన అడ్వాన్స్‌ను ఉద్యోగుల వేత‌నాల నుంచి ప‌ది నెల‌ల్లో ప్ర‌భుత్వం రిక‌వ‌రీ చేయ‌నుంది. దీంతో జగన్ సర్కార్ చేసిన ప్రకటన పట్ల ఏపీ ఆర్టీసీ కార్మికులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే నాయకుడు జగన్ అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: