ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో వినూత్న పథకాలు ప్రవేశ పెడుతు  అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నేడు జగన్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రంలోని నేతన్నలందరికి  చేయూతనిచ్చే విధంగా వైయస్సార్ నేతన్న నేస్తం అనే పథకానికి ఊపిరి పోశారు ముఖ్యమంత్రి జగన్ . అనంతపురం జిల్లాలోని ధర్మవరంలో ఏర్పాటు చేసిన భారీ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ నేతన్న  నేస్తం పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అయితే వైఎస్ఆర్ నేతన్న  నేస్తం పథకాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన రెండు గంటలకే ఆయన లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు పడేలా చర్యలు తీసుకున్నారు. 

 

 

 

 ఒక్కో మగ్గానికి 24 వేల చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు వైఎస్ఆర్ నేతన్న నేస్తం  పథకాన్ని ప్రారంభించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి... రాష్ట్రంలోని చేనేత కుటుంబాలు అందరికీ అండగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ బటన్ నొక్కుతున్నాను అంటూ వ్యాఖ్యానించారు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 85 వేల నేతన్నల కుటుంబాలు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేస్తాం అంటూ జగన్ తెలిపారు. ధర్మవరం లోనే అక్షరాల 10,700 కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని జగన్ తెలిపారు. మొత్తం అనంతపురం జిల్లా వ్యాప్తంగా 27 వేల మందికి ఈ పథకం ద్వారా మేలు జరుగుతుందని తెలియజేశారు. 

 

 

 ఈ సందర్భంగా లాప్టాప్ లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బటన్ క్లిక్ చేయగానే లబ్ధిదారులకు ఖాతాలో డబ్బులు జమ అయినట్లు మెసేజ్లు వచ్చాయి. దీంతో నేతలంతా హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఓ నేతన్న  తన ఖాతాలో డబ్బులు జమ అయితాయని  వచ్చిన మెసేజ్ లు పెడుతూ ఆనందంలో మునిగి పోయాడు. మరికొద్ది సమయంలో మీ ఖాతాలో 24 వేల రూపాయలు జమ అవుతుందని నేతన్నలకు వచ్చిన మెసేజ్ లో ఉంది. కాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వైయస్సార్ నేతన్న  నేస్తం పథకం పై నేతన్నలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా ఇలాంటి పథకాన్ని ప్రవేశపెట్టడం సంతోషంగా ఉందన్నారు జగన్.

మరింత సమాచారం తెలుసుకోండి: