హైదరాబాద్ షాద్నగర్లో వైద్యురాలిపై అత్యాచారం చేసి హత్య చేసిన నలుగురు నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. అయితే నలుగురు నిందితుల ఎన్కౌంటర్లు  దేశవ్యాప్తంగా సంచలనం గా మారింది. దిశా  నిందితుల ఎన్కౌంటర్ ను వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైకోర్టులో దాఖలైన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. నలుగురు నిందితులు మృతదేహాలకు రీ  పోస్టుమార్టం నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. తెలంగాణ డాక్టర్లపై తమకు నమ్మకం లేదని పిటిషనర్ తరఫు న్యాయవాదులు కోర్టు లో తెలపగా తెలంగాణకు సంబంధం లేని అధికారులతో రీ  పోస్టుమార్టం ప్రక్రియ నిర్వహించాలని ఆదేశించినది  హైకోర్టు. 

 

 

 

 దీంతో ఇండిపెండెంట్ ఫోరెన్సిక్ నిపుణులతో రీ  పోస్టుమార్టం ప్రక్రియ చేపట్టే అవకాశముంది. ఎల్లుండి సాయంత్రం ఐదు గంటల లోపు నలుగురు నిందితులపై  రీ పోస్టుమార్టం ప్రక్రియ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని హైకోర్టు పేర్కొంది. పోస్టుమార్టం ప్రక్రియ మొత్తం వీడియో తీయాలని ఆదేశించింది హైకోర్టు.రీ  పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను  పోలీసుల సమక్షంలో నిందితుల కుటుంబీకులకు అప్పగించాలి  అని ఆదేశించింది హైకోర్టు . అయితే నేడు హైకోర్టులో విచారణ కు హాజరైన గాంధీ ఆసుపత్రి సూపర్-ఇండెంట్ కిరణ్  ఇప్పటికే నలుగురు నిందితుల మృతదేహాలు 50% కుళ్ళిపోయాయని  తెలిపారు. మృతదేహాలకు ఎంబాసింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నామని.. మరో వారం రోజుల్లో మృతదేహాలు  100% కుళ్లిపోయే  అవకాశం ఉందని స్పష్టం చేశారు. 

 

 

 

 అయితే దిశ కేసులో నలుగురు నిందితులను ఈ నెల 6వ తేదీన చటన్ పల్లి  వద్ద పోలీసులు ఎన్కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే దాదాపు ఈ ఘటన జరిగి 16 రోజులు అవుతున్నప్పటికీ ఇప్పటికీ విచారణ ఓ కొలిక్కి రాలేదు. ఓసారి నిందితులు మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయినప్పటికీ అంత్యక్రియలు మాత్రం జరగలేదు. దిశ నిందితుల ఎన్కౌంటర్ పై  సుప్రీంకోర్టు హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై విచారణ జరుగుతుండడంతో నలుగురు నిందితుల మృతదేహాలను గాంధీ ఆసుపత్రిలో భద్రపరిచారు. అయితే హైకోర్టు రీ  పోస్టుమార్టానికి అనుమతించడం... తెలంగాణ తో సంబంధంలేని ఫోరెన్సిక్ నిపుణులతో రి పోస్టుమార్టం చేయాలని ఆదేశించడంతో... పోస్టుమార్టం లో ఏవైనా నిజాలు బయట పడతాయా  లేక యాధావిదిగా  పోస్టుమార్టం పూర్తి చేసి మృత దేహాలను నిందితుల  కుటుంబాలకు అప్పగించడం జరుగుతుందా అనేది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: