ప్రపంచంలో రోజు రోజుకు అత్యాచారాలు పెరిగిపోతున్నాయి.  అత్యాచారాలు, వేధింపుల నుంచి మహిళలను కాపాడేందుకు ఎంతగా ప్రయత్నం చేస్తున్నా కుదరడం లేదు.  నిత్యం ఎక్కడో ఒకచోట ఇలాంటి ఇబ్బందులు కలుగుతూనే ఉన్నాయి.  గత కొంతకాలంగా క్రైమ్ రేట్ పెరిగిపోయింది.  ఇలా క్రైమ్ రేట్ పెరిగిపోవడం వలన ఎన్ని ఇబ్బందులు వస్తాయి అనే విషయం అందరికి తెలుసు.  క్రైమ్ రేట్ ఎక్కడ తక్కువగా ఉంటుందో అక్కడ అభివృద్ధి సాధ్యం అవుతుంది.  


ఇక ఇదిలా ఉంటె, ఇండియాలో సైతం క్రైమ్ రేట్ పెరిగిపోతూనే ఉన్నది.  ముఖ్యంగా మహిళలపై వేధింపులు, అత్యాచార ఘటనలు ఇటీవల కాలంలో పెరిగిపోతున్నాయి.  దీని నుంచి బయటపడేందుకు ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోంది.  అయినప్పటికీ వేధింపులు తగ్గడం లేదు.  డయల్ 100, డయల్ 112 తీసుకొచ్చింది.  నేరాలు అదుపులోకి రాకపోగా వేరే విధంగా వేధింపులు పెరిగిపోతున్నాయి.  క్రైమ్ రేట్ పెరిగింది.  


ఇక ఇదిలా ఉంటె, అమెరికాలోని పెన్సిల్వేనియాలోని యూపిఎంసీ కార్లస్లే హాస్పిటల్ లో అత్యవసర విభాగంలో మైఖేల్ డేవిడ్ అనే వ్యక్తి నర్సుగా పనిచేస్తున్నారు.  2016 జనవరిలో హాస్పిటల్ విభాగంలో జాయిన్ అయిన డేవిడ్ దాదాపుగా మూడేళ్లు పనిచేశాడు.  ఈ మూడేళ్ళలో అనేక క్రైమ్ కు పాల్పడ్డాడు.  అత్యవసర విభాగానికి వచ్చే మహిళలను లైంగికంగా హింసించేవాడు.  అలా లైంగికంగా హింసలకు గురిచేసి దారుణంగా వారిపై అత్యాచారాలు చేసినట్టు తేలింది.  


చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు దాదాపుగా 206 మందిపై అత్యాచారాలు చేశాడు.  వీటికి సంబంధించి వీడియోలు తీసి తన ల్యాప్ టాప్ లో భద్రపరుచుకున్నాడు.  అతని పర్సనల్ ల్యాప్ టాప్ ఓపెన్ చేస్తే ఈ వీడియోలు బయపడ్డాయి.  దీంతో మైఖేల్ డేవిడ్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.  206 మందిపై అత్యాచారాలు చేసేంత వరకు మైఖేల్ ను పట్టుకోలేకపోయారంటే ఆలోచించాల్సిన విషయమే.  మూడేళ్ళ నుంచి ఇలానే చేస్తున్నాడు.  చివరకు దొరికిపోయాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: