ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ ఎంతైనా అవసరమని.. రాష్ట్రంలో ఒకే చోట కాకుండా రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి జరిగితే బాగుంటుందని దీనికోసం రాజధాని ఏర్పాటయ్యే అవకాశం ఉందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా వ్యాఖ్యానించడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద దుమారమే రేపింది. ప్రస్తుతం ఉన్న రాజధాని అమరావతి తో పాటు కర్నూలు విశాఖలో కూడా మరో రెండు రాజధానులు ఏర్పాటు చేస్తామంటూ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాగా జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా అమరావతి రైతులందరూ భగ్గుమన్నారు. ఓవైపు విపక్ష పార్టీల జగన్మోహన్రెడ్డి 3 రాజధానిల నిర్ణయంపై దుమ్మెత్తి పోస్తున్నాయి. ఇక అటు అమరావతి రైతులు కూడా జగన్మోహన్ రెడ్డి నిర్ణయం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము మూడు పంటలు పండించుకునే భూమిని రాజధాని నిర్మాణం కోసం తమ  పిల్లల భవిష్యత్తు కోసం భవిష్యత్ తరాల అభ్యున్నతి కోసం త్యాగం చేశామని కానీ ఇప్పుడు రాజధాని మార్పు చేస్తామంటే తమకు న్యాయం జరుగుతుంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అమరావతి. 

 

 

 

 అంతేకాకుండా గత మూడు రోజుల నుండి అమరావతి రైతులందరూ రిలే నిరాహారదీక్షలు చేపడుతున్నారు అమరావతి రైతులు చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తున్నాయి. అమరావతి రైతులందరూ రోడ్ల పైకి చేరి ధర్నాలు రాస్తారోకోలు చేస్తుండడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇకపోతే తాజాగా రైతులు మరింత రెచ్చిపోయారు. రాయపూడి గ్రామ పంచాయతీకి వేసిన వైసిపి రంగులను తొలగిస్తూ నల్ల రంగును వేశారు రాయపూడి గ్రామానికి చెందిన రైతులు. వైసిపి రంగులు తొలగించి నల్ల రంగు వేసింది వైసిపి పార్టీకి చెందిన రైతులే అని అక్కడి స్థానికులు అంటున్నారు.

 

 

 

 జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అందుకే కడుపు మండి  వైసిపి రంగులను తొలగించాం అని  రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ అడ్డుకోవడానికి వచ్చిన పంచాయతీ కార్యాలయం సిబ్బందిని మీ పని మీరు చేసుకోండి మా పని మేము చేసుకుంటాం అంటూ అలాగే రంగులు వేశారు. మాకు  అన్యాయం చేసిన వైసీపీ ప్రభుత్వ రంగులు ఈ పంచాయతీ కార్యాలయానికి ఉండడానికి వీలు లేదు అంటూ పంచాయతీ కార్యాలయానికి మొత్తం నల్ల రంగును వేసారు రైతులు. దీంతో రాయపూడి లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అయితే పంచాయతీ కార్యాలయానికి వైసిపి రంగులు తొలగించి నల్ల రంగులు వేస్తున్న వారిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించినప్పటికీ వైసిపి కార్యకర్తలు మాత్రం వారిని అడ్డుకున్నారు. దీంతో వారిని అదుపులోకి తీసుకోలేకపోయారు పోలీసులు. రాష్ట్ర రాజధాని ఇక్కడ లేనప్పుడు ఇక్కడ ఇంకా వైసిపి రంగులు ఎందుకు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రాయపూడి గ్రామస్తులు.

మరింత సమాచారం తెలుసుకోండి: