అవును! రాజ‌కీయాల్లో నేత‌ల‌కు ఏదైనా చేయాల‌నే సంక‌ల్పం ఉండాలే కానీ, ఏదైనా చేయొచ్చ‌ని నిరూపిస్తు న్నారు ఏపీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్‌. ముఖ్యంగా కొన్ని ద‌శాబ్దాలుగా వెనుక‌బాటులో ఉన్న ఎస్టీ, ఎస్టీ వ‌ర్గా లకు ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ చేయ‌ని విధంగా ఆయ‌న అనేక సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను అమ‌లు చేస్తున్నారు., ఎస్టీల్లోని మ‌హిళ‌ల‌కు 45 ఏళ్లు నిండితే పింఛ‌న్లు ఇచ్చే కార్య‌క్ర‌మాన్ని త్వ‌ర‌లోనే ప్రారంబించేందుకు జ‌గ‌న్ స‌న్నాహాలు చేస్తున్నారు. అదేస‌మ‌యంలో వారికి అన్ని ప‌ద‌వుల్లోనూ 50 శాతం కోటా అమ‌లు చేసేలా ఇప్ప టికే ఆదేశాలు జారీ చేశారు దీంతో రాష్ట్రంలోని అన్ని నామినేటెడ్ ప‌ద‌వుల్లోనూ ఎస్టీ వ‌ర్గానికి ఫిఫ్టీ ప‌ర్సెంట్ కోటా అమ‌లు కానుంది.

 

అదే స‌మ‌యంలోఎస్టీ, ఎస్సీలు ఎక్కువ‌గా ఉన్న జిల్లాల్లో వారికి ప్ర‌త్యేకంగా పాఠ‌శాల‌లు, విద్యాల‌యాలు, యూనివ‌ర్సీటిలు ఏర్పాటు చేసేందుకుకూడా జ‌గ‌న్ ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా పారిశుధ్య కార్మికులుగా ఉన్న ఎస్సీల‌కు, ఎస్టీల‌కు మెరుగైన జీవ‌న ప్ర‌మాణాల‌ను అందించేందుకు కృషి చేస్తున్నారు. ఇప్ప‌టికే వారికి ఇస్తున్న వేత‌నాన్ని రూ.8 వేల నుంచి డ‌బుల్ చేసి రూ.16 వేల‌కు పెంచారు. ఇది వ‌చ్చే జ‌న‌వ‌రి నుంచి అమ‌లు చేయ‌నున్నారు. అదేస‌మ‌యంలో త‌న కేబినెట్‌లోనూ కీల‌క‌మైన హోం మంత్రి, డిప్యూటీ సీఎం పోస్టుల‌ను ఆయా వ‌ర్గాల‌కు చెందిన మ‌హిళ‌ల‌కే కేటాయించారు.

 

ఇక‌, తాజాగా రాష్ట్రంలో ఎస్సీ క‌మిష‌న్ ను రెండు గా విభ‌జించారు. ఇది గ‌తంలో ప్ర‌తిపాద‌న ఉన్న‌ప్ప‌టికీ.. విభ‌జించే సాహ‌సం ఎవ‌రూ చేయ‌లేదు. కానీ, జ‌గ‌న్ ఒకే ఒక్క నిర్ణ‌యంతో ఎస్సీ, ఎస్టీల‌కు మేలు చేసేందు కు ఏప‌నైనా చేస్తాన‌ని ప్ర‌క‌టించ‌డ‌మే కాకుండా తాను రెండు క‌మిష‌న్‌లు ఏర్పాటు చేసి, ఇద్ద‌రు చైర్మ‌న్‌ల ను ఏర్పాటు చేయ‌డంతోపాటు భారీగా నిధులు కూడా కేటాయించేందుకు పూనుకున్నారు. అదేస‌మ‌యంలో వారికి వైద్య సౌక‌ర్యం అందించేందుకుఉన్న అన్ని అవ‌కాశాల‌ను స‌ద్వినియోగం అయ్యేలా చ‌ర్యలు తీసుకుంటున్నారు. మొత్తంగా చూసుకుంటే.. జ‌గ‌న్ ఎస్సీ, ఎస్టీల‌కు ప‌క్ష‌పాతిగా చెప్ప‌డంలో ఎలాంటి సందేహం లేదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: