ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో ఆంధ్ర రాష్ట్రానికి మూడు రాజధానులు ఉంటే బాగుంటుందని తెలిపిన అభిప్రాయం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో మరియు మీడియా వర్గాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది. లెజిస్లేటివ్ రాజధానిగా అమరావతి ప్రాంతాన్ని జుడిషియల్ క్యాపిటల్ గా కర్నూలు ప్రాంతాన్ని ఆర్థిక రాజధానిగా విశాఖను పెడితే బాగుంటుందని జగన్ తెలపడం జరిగింది. ఇదే తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి మరియు రాజధాని విషయంలో రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ జి.ఎన్.రావు అధ్యక్షతన జగన్ సెప్టెంబర్ 13న కమిటీ వేసిన సంగతి అందరికీ తెలిసినదే. అయితే తాజాగా ఆ కమిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 జిల్లాలు పర్యటించి ప్రజాభిప్రాయ సేకరణ చేసి ఇటీవల రిపోర్ట్ ముఖ్యమంత్రి జగన్ కి ఇవ్వడం జరిగింది.

 

ఆ తర్వాత కమిటీ సభ్యుల అధ్యక్షుడుజి.ఎన్.రావు మీడియాతో మాట్లాడుతూ..విశాఖ పట్నంలో సచివాలయం, సి.ఎమ్. క్యాంప్ ఆఫీస్ తో పాటు, వేసవి కాలం అసెంబ్లీ సమావేశాలు జరగాలని సీఎం జగన్ కి సూచించామని తెలిపారు. అమరావతిలో రైతులకు సంభందించిన భూములు తీసుకున్నందున వాటిని కూడా అబివృద్ది చేయాల్సి ఉంటుందని కమిటీ సభ్యులు వివరించారు. అమరావతిలో గవర్నర్ కార్యాలయం ఉండాలని...విశాఖలో అంతర్జాతీయ స్తాయిలో సదుపాయాలు ఉండాలని, ఆ ప్రాంతంలో ప్రభుత్వ భూములు కూడా అదికంగా ఉన్నాయని తెలిపారు.

 

డబ్బంతా ఒకే చోట పెట్టడం కాకుండా, రాష్ట్రం అంతటా ఖర్చు పెట్టాలని కమిటీ సభ్యులు అన్నారు. శివరామకృష్ణ కమిటీలో కూడా ఇలాంటి సూచనలు ఉన్నాయని..మేము చాలా జాగ్రత్తగా అన్ని విషయాలు పరిశీలించి నిర్ణయాలు చేశామని కమిటీ సబ్యులు తెలిపారు. ఇటువంటి నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయిలో విశాఖపట్టణం అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో జగన్ క్యాంప్ ఆఫీస్ భీమిలి ప్రాంతంలో పెట్టడానికి వైసిపి పార్టీ అధిష్టానం ఆలోచిస్తున్నట్లు ఇప్పటికే స్థలం కోసం భీమిలి ప్రాంతానికి చెందిన వైసీపీ పార్టీ నాయకులు వెతుకుతున్నట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: