.

విశాఖ పట్నంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. శనివారం ఉదయం చేసిన ఈ వేడుకల్లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మంత్రి అవంతి శ్రీనివాసరావు సహా వైసీపీ నేతలు కార్యకర్తలు  ఈ వేడుకలో పొల్గొన్నారు.   కేక్ కట్ చేసి జగన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. తదనంతరం  విజయసాయిరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు.

 

 వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.ఏపీకి ఇప్పటికే మూడు రాజధానులు అవసరం అని ఈ విషయం లో సీఎం జగన్ చరిత్ర సృష్టించాడని విజయసాయిరెడ్డి పొగిడారు ప్రజలకు సేవ చేయడమే జగన్ సంకల్పమని..పదవి  కోసం కాదని  ప్రజలకు సేవ చేయడమే ఆయన ముక్య ఉద్దేశమని  వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వివరించారు.

 

విశాఖను అడ్మినిస్ట్రేటివ్ రాజధానిగా చేసిన జగన్ నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఎగ్జిక్యూటివ్ రాజధాని అంటే ముఖ్యమంత్రి, గవర్నర్, మిగిలిన మంత్రులకు అధికార నివాసం మాత్రమే కాదన్న విజయసాయి.. అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. పారిశ్రామిక రంగం, సేవా రంగం, వ్యవసాయ రంగం అన్నింటిలో విశాఖ ముందంజలో ఉంటుందని వ్యాఖ్యానించారు. విశాఖపట్నం రానున్న పదేళ్లో ముంబై తరహాలో అభివృద్ధి జరుగుతుందన్నారు విజయ్ సాయి రెడ్డి.

 

  ఆంధ్రప్రదేశ్ లో త్వరలోనే 25 జిల్లాలు ఏర్పడబోయే చాన్స్ ఉందని త్వరలోనే 25 జిల్లాలుగా ఏపీని విభజించడం ఖాయమని విజయసాయిరెడ్డి పరోక్షంగా హింట్స్ ఇచ్చారు.  వైసీపీ ప్రభుత్వం వికేంద్రీకరణతో అభివృద్ధి చేస్తుందని.. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలు 25 జిల్లాలుగా చేస్తామని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. అధికార వికేంద్రీకరణ జరగాలన్నదే సీఎం జగన్ ముఖ్య ఉద్దేశం అని అన్నారు. త్వరలోనే 25 జిల్లాలు చేసి అన్ని జిల్లాలను సమానంగా అభివృద్ధి చెందాలన్నదే సీఎం జగన్ సంకల్పం అని విజయ్ సాయి రెడ్డి పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: