ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు. ఆయ‌న ఆరు నెల‌ల పాల‌న జ‌న‌రంజిక పాల‌న అని చెప్పాలి. నవరత్నాలతో పాటూ కొత్త సంక్షేమ పథకాలకు శ్రీకారం చుడుతున్నారు. అలాగే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నేరవేరుస్తూ ముందుకు సాగుతున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు మరో పథకానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధమయ్యారు.  వైఎస్సార్‌ మత్స్యకార నేస్తం పథకాన్ని తూర్పుగోదావరిలో ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఇటీవ‌లె త‌న ట్వాట్ట‌ర్ వేదిక‌గా ఈ విష‌యాన్ని తెలిపారు. తన ఆనందాన్ని అందరితో పంచుకున్నారు. ఆయ‌న ప్రతిహామీని బాధ్యతగా నెరవేరుస్తున్నారు.

 

ముఖ్యమంత్రి జగన్ తన పాదయాత్ర సమయంలో ఎంద‌రో సమస్యలను గుర్తించారు. వారి సమస్యలన్నీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఎన్నో ప‌థ‌కాల‌ను చేప‌డుతూ ప్ర‌జ‌ల‌కు చేరువ‌వుతున్నారు. చేపల వేట నిషేధ కాలం కారణంగా మత్స్యకారులు ఆదాయం కోల్పోతారు.. ఆ సమయంలో పూట గడవడం కూడా వారికి కష్టం.. అందుకే రూ.10వేలు సాయం అందించనున్నారు. అలాగే చనిపోయిన మత్స్యకార్మికుల కుటుంబాలను ఆదుకునేందుకు రూ.5 లక్షలు ఉన్న పరిహారాన్ని రూ.10 లక్షలకు పెంచారు. మత్స్యకారులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని జగన్‌ హామీ ఇచ్చారు.

 

తెలుగు ప్రజల గుండెల్లో దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుకు ఎంత‌ చెక్కుచెదరని స్థానం ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.  1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ ఎంతోమంది పేద బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారు. అలాగే బడుగు బలహీన వర్గాలకు రాజకీయంగా మంచి అవకాశాలు కల్పించారు. ఎన్టీఆర్ ఇచ్చిన ప్రోత్సాహంతో ఎంతో మంది సామాన్యులు రాజకీయాల్లో హీరోలయ్యారు. అలాగే ఎంతోమంది పేద ప్రజలను తన సంక్షేమ పథకాల ద్వారా ప్ర‌జ‌ల గుండెల్లో నిలిచిపోయారు. ఆ త‌ర్వాత ఎన్టీఆర్ తర్వాత ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చిన వారెవరికీ దక్కని క్రేజ్ మళ్లీ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కి దక్కింది. తిరిగి ఇప్పుడు ఆరు నెల‌ల పాల‌న‌తోనే జ‌గ‌న్ ప్ర‌జ‌ల‌కు జ‌న‌రంజిక పాల‌న‌ను అందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: