వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వరసగా అనేక పధకాలు రూపొందించి ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తున్నది.  దీంతో ప్రజలకు చేరువైంది.  ఏవో కొన్ని మినహా మిగతా పధకాలు అన్ని కూడా ప్రజలకు దగ్గర చేశాయి.  ఇక ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందించాలనే లక్ష్యంతో మూడు ప్రాంతాలను అభివృద్ధికోసం ఓ విజన్ తో వైఎస్ జగన్ ముందుకు వచ్చారు.  అలా తీసుకొచ్చినదే మూడు రాజధానుల ప్రతిపాదన.  


ఈ ప్రతిపాదనను ఇటీవలే అసెంబ్లీలో చివరి రోజున చేశారు.  ఆ రోజు తరువాత జీఎన్ రావు కమిటీ నివేదికను అందించింది.  ఈ నివేదికలో మూడు రాజధానుల మాట ఉన్నది.  పరిపాలన రాజధానిగా విశాఖ, శాసనసభ రాజధానిగా అమరావతి, జ్యుడిషియల్ రాజధానిగా కర్నూలును చేయాలని నివేదికలో పేర్కొన్నది.  ఈ నివేదిక ఆధారంగా  నాలుగు రీజియన్లను ఏర్పాటు చేయాలనీ, నాలుగు కమిషనరేట్ లు ఉండాలని కమిటీ నివేదికలో పేర్కొన్నది.  


ఈ నివేదికపై కొన్ని ప్రాంతాల్లో సంబరాలు చేసుకుంటుంటే మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ముఖ్యంగా రాజకీయాలకు కేంద్రబిందువుగా ఉండే విజయవాడ, గుంటూరు వాసులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు.  రాజధాని అమరావతిలోని ఉంచాలని అంటున్నారు.  ఇక జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదికను కొంతమంది సెలెబ్రిటీలు కూడా ఆహ్వానిస్తున్నారు.  ఇలా ఆహ్వానిస్తున్న వ్యక్తుల్లో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు.  


జగన్ ముఖ్యమంత్రి అయ్యాక చాలా కాలం తరువాత తాడేపల్లి వెళ్లి ముఖ్యమంత్రి జగన్ ను కలిశారు.  అక్కడే వాళ్ళ ఇంట్లోనే భోజనం చేశారు.  అనంతరం ఇద్దరు కలిసి కాసేపు ముచ్చటించుకున్నారు.  కాగా, ఇప్పుడు జీఎన్ రావు ఇచ్చిన నివేదికలోని మూడు రాజధానుల అంశాన్ని మెగాస్టార్ స్వాగతించడంతో చాలా విషయాలు చర్చకు వస్తున్నాయి.  తరచుగా జగన్ నిర్ణయాలు సమర్థిస్తున్న మెగాస్టార్ వచ్చే ఎన్నికలలోపు వైకాపా జాయిన్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.  అదే జరిగితే తమ్ముడు పవన్ కళ్యాణ్ కు  అన్నయ్య మెగాస్టార్ పోటీ అవుతాడని చెప్పొచ్చు.  ఇది రాజకీయంగా మాత్రమే అని మనం అర్ధం చేసుకోవాలి. ఒకే కుటుంబంలో ఇద్దరు వ్యక్తులు వేరువేరు పార్టీల్లో  ఉన్న సంగతి తెలిసిందే కదా.  

మరింత సమాచారం తెలుసుకోండి: