ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏపీలో ఆరోగ్యశ్రీ పథకం ప్రారంభమైంది. రాజశేఖర్ రెడ్డి పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందాలని సంకల్పించి ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద అర్హత పొందిన పేద రోగులకు ఉచితంగా వైద్య చికిత్స అందిస్తారు. వైయస్ మరణానంతరం ఈ పథకం సరిగ్గా అమలు కాలేదు. 2014 లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత ఈ పథకం అమలు సరిగ్గా జరగలేదని విమర్శలు వినిపించాయి. 
 
సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఆరోగ్యశ్రీ పథకానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఆరోగ్యశ్రీ పథకానికి సీఎం జగన్ పునర్వైభవం తెచ్చారు. తండ్రి బాటలో నడుస్తూ ఆరోగ్యశ్రీ పథకం అమలు విషయంలో సీఎం జగన్ మరిన్ని మార్పులను తీసుకొనివచ్చి ఏపీ ప్రజలకు లబ్ధి చేకూరేలా చేస్తున్నారు. ఏపీ సీఎం జగన్ నవంబర్ 1వ తేదీ నుండి ఆరోగ్యశ్రీ పథకాన్ని చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ లోని 150 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో అందించేలా ఆదేశాలు జారీ చేశారు. 
 
ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని విసృతం చేస్తూ ఇప్పటికే ఉన్న వ్యాధులతో పాటు మరికొన్ని వ్యాధులను కూడా ఆరోగ్యశ్రీ జాబితాలో చేర్చడానికి సీఎం జగన్ ఆమోదం తెలిపారు. ఎన్నికల ముందు సీఎం జగన్ వైద్య చికిత్సకు ఖర్చు వెయ్యి రూపాయలకు పై బడితే ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వైద్యం చేసేలా హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే ఆ మాటను నిలబెట్టుకున్నారు. 5 లక్షల రూపాయల లోపు ఆదాయం ఉన్నవారికి ఈ పథకం వర్తిస్తుంది. 
 
అన్ని రకాల బియ్యం కార్డులు ఉన్నవారికి కూడా ఈ పథకం వర్తిస్తుంది. జగనన్న విద్యా వసతి దీవెన కార్డు ఉన్న కుటుంబాలు, వైయస్సార్ పింఛన్ కార్డు ఉన్న కుటుంబాలు కూడా ఆరోగ్యశ్రీ పథకానికి అర్హులు. ప్రైవేట్ రంగ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేస్తూ గౌరవ వేతనంపై ఆధారపడి జీవించేవారు కూడా ఈ పథకానికి అర్హులు. కుటుంబంలో ఒక కారు ఉన్నా ఈ పథకానికి అర్హులు. సీఎం జగన్ తన తండ్రి బాటలో నడుస్తూ ఆరోగ్యశ్రీ పథకానికి పునర్వైభవం దిశగా అడుగులు వేయటంపై రాష్ట్ర ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: