గౌతమ్ గంభీర్...మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ. గ‌తంలో ఓ పాకిస్థానీ చిన్నారికి ఇండియాలో హార్ట్ సర్జరీ జరగబోతోంది. పాకిస్థాన్ కు చెందిన చిన్నారి ఒమైమా ఆలీ గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్టు ఎంపీ గౌతమ్ గంభీర్ దృష్టికి వచ్చింది. ఆమెకు మెరుగైన వైద్యం కోసం ఇండియాకు తరలించే ప్రయత్నంలో వీసా అనుమతి కావాల్సి ఉండటంతో.. గంభీర్ చొరవ తీసుకున్నారు. అయితే, గౌతమ్ గంభీర్ ను  చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు బెదిరించారు.

 


తాజాగా, ఇటర్నేషనల్ నంబర్ నుంచి  కాల్ చేసి తన ఫ్యామిలీని చంపేస్తామంటూ వార్నింగ్ ఇస్తున్నారని గంభీర్ ఢిల్లీ పోలీసులకు కంప్లైంట్ చేశారు. దీనిపై వెంటనే కేసు నమోదు చేసి  విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. తనకు తన ఫ్యామిలీకి సెక్యూరిటీ కల్పించాలని కోరారు. గంభీర్ కంప్లైంట్ తో ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, ఈ బెదిరింపు వెనుక స్ప‌ష్ట‌మైన కార‌ణాలు తెలియ‌రాలేదు.

 

ఇదిలాఉండ‌గా, పాకిస్థానీ చిన్నారికి ఇండియాలో వైద్యం కోసం ప్ర‌య‌త్నించ‌గా...త‌న దృష్టికి రావ‌డంతో పాస్‌పోర్ట్ ఇవ్వాల‌ని విన్నవిస్తూ…. అక్టోబర్ 1వ తేదీన భారత విదేశాంగ శాఖకు లెటర్ ద్వారా తెలిపారు. దీనిపై అక్టోబర్ 9వ తేదీన విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ నుంచి గంభీర్ రిప్లై అందుకున్నారు. ఇస్లామాబాద్ లోని భారత హైకమిషన్ ఆ చిన్నారికి అవసరమైన వీసా ఏర్పాట్లు చేస్తుందంటూ జయశంకర్ ఆ లెటర్ లో తెలిపారు. తాజాగా… పాకిస్థానీ చిన్నారి ఒమైమా ఆలీ, ఆమె తల్లిదండ్రులకు భారత వీసా అందింది. ఇండియాలో వైద్య సహాయం తీసుకునేందుకు పాకిస్థానీ చిన్నారికి స్వాగతం అంటూ సోషల్ మీడియాలో స్పందించారు గంభీర్. ఇండియాపై ద్వేషం చూపించే పాకిస్థాన్ ప్రభుత్వం, ఉగ్రవాదాన్ని పెంచిపోషించే ఐఎస్ఐ లకే తాను వ్యతిరేకమనీ.. అంతేకానీ పాకిస్థానీ ప్రజలపై కాదని గంభీర్ చెప్పారు. ఓ పాకిస్థానీ చిన్నారి భారత్ లో వైద్యం అందుకుని ప్రాణాలు దక్కించుకుంటే అంతకంటే కావాల్సిందేముంటుందని బీజేపీ ఎంపీ చెప్పారు. కాగా అలా మాన‌వ‌త్వం చాటుకున్న వ్య‌క్తికి ఈ బెదిరింపులు రావ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: