కాంగ్రెస్ పార్టీ గత కొన్ని రోజులుగా పౌరసత్వ సవరణ బిల్లు విషయంలో రగడ చేస్తున్నాయి.  పౌరసత్వం విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకున్నా అమాయకులను రెచ్చగొట్టి బిల్లు పేరుతో ఇబ్బందులు కొనితెస్తున్నాయి.  ఈ రగడ కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.  సామాన్యులు అనేక సమయాలు ఎదుర్కొంటున్నారు.  కాంగ్రెస్, తృణమూల్, లెఫ్ట్ మరికొన్ని పార్టీలు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.  


బిల్లు విషయంలో కేంద్రం ఎలాంటి తప్పు చేయలేదు.  గతంలో కాంగ్రెస్ చెప్పినట్టుగానే బిల్లు సవరించింది.  ముస్లిం దేశాల్లో మైనారిటీలుగా ఉన్న హిందువులు, సిక్కులు, బౌద్దులు తదితరులు మతపరమైన పీడన ఎదుర్కొంటు ఇండియాకు వస్తే వారికీ పౌరసత్వం కల్పించేందుకు బిల్లును సవరించారు.  దాని వలన వచ్చిన ఇబ్బందులు ఏమీలేవు.  అయితే, ఇండియాకు వచ్చే ముస్లింలకు కూడా పౌరసత్వం కల్పించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాదిస్తోంది.  


ముస్లిం దేశాల్లో ముస్లింలు మైనారిటీలు కాదు.  మెజారిటీ వ్యక్తులు.  అలాంటప్పుడు ముస్లింలకు ఎందుకు భారత పౌరసత్వం కల్పించాలి.  అవసరం ఏంటి అని అంటోంది బీజేపీ.  కాంగ్రెస్ మాత్రం వితండవాదం చేస్తూ వారికీ కూడా పౌరసత్వం కల్పించాల్సిందే అని పట్టుబడుతున్నది.  అసలు బిల్లులో ఉన్న విషయాలు చాలా వరకు చాలా మందికి తెలియవు.  తెలియకుండానే బిల్లును తప్పుపడుతున్నారు.  


ఇదిలా ఉంటె, కాంగ్రెస్ పార్టీ నేత శశిథరూర్ కేరళలో పౌరసత్వం బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టబోతున్నారు.  దీనికి సంబంధించిన ఇండియా మ్యాప్ ను స్లోగన్ ను రిలీజ్ చేసి ఆందోళన చేపట్టేందుకు అందరూ ఆహ్వానితులే అని పేర్కొన్నారు.  అయితే, ఇండియా మ్యాప్ లో పీవోకే లేకపోవడంతో నెటిజన్లు షాక్ అయ్యారు.  ఇండియా లోని పీవోకే ను లేకుండా మ్యాప్ ను రిలీజ్ చేసి నిరసనలు చేయడం పట్ల కాంగ్రెస్ పార్టీ లోగుట్టు బయటపడిందని అంటున్నారు.  కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ కు సపోర్ట్ చేస్తోందని, ఇండియాను అవమానించే విధంగా ఇండియాను రూపొందించారని, పౌరసత్వం గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదని నెటిజన్లు అంటున్నారు.  కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసిన మ్యాప్ పై నెటిజన్లు మండిపడుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ దీని గురుంచి ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: