అసెంబ్లీలో సిఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ కి మూడు రాజధానులు ఉండబోతున్నాయి అని ప్రకటన చేసారు.. ఆ ప్రకటన అనంతరం ప్రజలలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది... రాజధాని కోసం భూములు ఇచ్చిన ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రాజధాని అమరావతి లోనే ఉండాలని నిరసనలు చేస్తున్నారు.. తాజాగా ఇదే విషయంపై మాజీ కేంద్ర మంత్రి, మెగాస్టార్ చిరంజీవిగారు స్పందించారు..

 

జగన్ కి మద్దతు ప్రకటించారు. అమరావతి లో శాసన నిర్వాహక .. విశాఖపట్నం లో కార్యనిర్వాహక.. కర్నూల్ లో న్యాయపరిపాలన రాజధానులుగా మార్చే ఆలోచనను అందరం స్వాగతించాలంటూ చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేసారు... సిఎం గారు మూడు జిల్లాల ప్రజల మనోభావాలను దెబ్బతీయకుండా అలోచించి నిర్ణయం తీసుకున్నారని, దీనివల్ల మూడు జిల్లాలలో అభివృద్ధి జరుగుతుందని తెలిపారు.

 

గత అభివృద్ధి అంతా, పాలన అంతా హైదరాబాద్ లోనే కేంద్రీకృతమైందినే విషయాన్ని గుర్తు చేసారు.హైదరాబాద్ అభివృద్ధి వల్ల ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వెనుకబడిందని గుర్తుచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో మిగితా ప్రాంతాలు నిర్లక్ష్యం కావడం వల్లే ఆర్దిక.. సామాజిక సమతుల్యాలు దెబ్బతిన్నాయని చిరంజీవి విశ్లేషించారు. ఇప్పటికే 3 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్న రాష్ట్రంలో ఇంకో లక్షకోట్లు అప్పుతో అమరావతిని నిర్మిస్తే ఉత్తరాంధ్ర.. రాయలసీమ పరిస్ధితి ఏమిటన్న ఆందోళన అందరిలో ఉందని చిరంజీవి ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యలతో ఏకీభవించారు.

 

రాయలసీమ లో రాజధాని లేకపోతే అక్కడ ప్రజల మనోభావాలు దెబ్బతింటాయి..మూడు జిల్లాలు అభివృద్ధి అనేది జరిగితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి పెరిగిద్ది అని తెలిపారు. మూడు జిల్లాలో ఉన్న నిరుద్యోగ యువత కి ఉపాధి అనేది ఏర్పడిద్ధి అని తెలిపారు.

 

ఇదే సమయంలో రాజధాని రైతులలో నెలకొన్న భయాందోళనలు ..అభద్రతాభావాన్ని తొలగించాలని చిరంజీవి ఏపీ ప్రభుత్వానికి సూచించారు. వాళ్లు నష్టపోకుండా.. న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ జగన్ గారికి సంగిభావం తెలిపారు... చిరంజీవి వ్యాఖ్యలకి ఎవరు ఎలా స్పందిస్తారో చూడాలి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: