ప్రేమించ‌డానికి వ‌య‌సుతో సంబంధం లేదు అని అంటుంటారు కొంద‌రు. కానీ పెళ్లి విష‌యానికి వ‌చ్చేస‌రికి మాత్రం అన్నీ గుర్తొస్తుంటాయి.  స‌మాజం, పెద్ద‌వాళ్ళు, కుటుంబ స‌భ్యులు ఇలా ఎన్నో విష‌యాల గురించి భ‌య‌ప‌డాల్సి వ‌స్తుంది. అబ్బాయి కంటే అమ్మాయి వ‌య‌సు చిన్నగా ఉండేలా  జ‌రుగుతుంటాయి మ‌న వివాహాల‌న్నీ. అది సంప్ర‌దాయం కాన‌ప్ప‌టికీ ఎప్ప‌టి నుంచో అదే ఆన‌వాయితీగా పాటిస్తుంటారు మ‌న పెద్ద‌లు. అయితే ఈ మ‌ధ్య కాలంలో అలాంటివి ఎక్క‌డా ప‌ట్టించుకోవ‌డంలేదు. కానీ ఇక్క‌డ జ‌రిగిన ప్రేమ మాత్రం అబ్బాయి కంటే అమ్మాయి ఏకంగా తొమ్మిదేళ్ళు పెద్దది. దాంతో స‌మాజానికి భ‌య‌ప‌డి చివ‌రికి ఇద్ద‌రూ ప్రాణాలు తీసుకున్నారు. ఈ ఘ‌ట‌న కృష్ణాజిల్లాలో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే...

 

ప్రేమించుకునే స‌మ‌యంలో వ‌య‌సు గురించి ఆలోచించ‌లేదు. వివాహం విష‌యానికి వ‌చ్చేస‌రికి స‌మాజం ఏమంటుందో అని భ‌య‌ప‌డి చివ‌రికి ఇద్ద‌రూ ప్రాణాలు కోల్పోయారు. ఆమె వయసు ఇరవై ఎనిమిది. అతడి వయసు పందొమ్మిది. ఇద్దరూ ప్రేమించుకున్నారు. కుటుంబాలకు తెలియకుండా కలసి గడిపారు. ఆమె గర్భవతి అయింది. ఇద్దరి మధ్య వయసుతేడా తొమ్మిదేళ్లు ఉంది. అదే అమ్మాయి చిన్న అయితే .. అసలు విషయమే అయి ఉండేది కాదు..కానీ ఇక్కడ అబ్బాయి చిన్నవాడు. సమాజానికి ఎలా సమాధానం చెప్పాలో తెలియక.. వారు ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. ఈ కొత్త తరహా విషాదాంత ప్రేమ కథ .. కృష్ణాజిల్లాలో జరిగింది. విజయవాడలోని ఓ లాడ్జిలో రెండు రోజుల ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసింది. 

 

వారిని గన్నవరం మండలం తెంపెల్లి గ్రామానికి చెందిన నాగగౌతమి, గుడివాడకు చెందిన లోకేష్‌గా గుర్తించారు. లోకేష్‌, గౌతమి కొంతకాలంగా ప్రేమించు కుంటున్నారు. ఇంట్లో పెళ్లికి పెద్దల్ని ఒప్పించలేకపోయారు. ఆమె కనీసం తల్లిదండ్రులకు చెప్పలేకపోయింది. గర్భవతి కావడంతో ఆందోళనలో ఉన్నట్లు డైరీలో రాసింది గౌతమి. గౌతమి  పాలిటెక్నిక్‌ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేసే సమయంలో అదే కాలేజీలో చదువుతున్న లోకేష్‌తో పరిచయం అయింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. ప్రస్తుతం పాలిటెక్నిక్‌ మూడో ఏడాది చదువుతున్నాడు లోకేష్‌. ఆత్మహత్యాయత్నంతో గౌతమి మృతి చెందింది. లోకేష్ కొనఊపిరితో ఉన్నాడు. ప్రేమించినప్పుడు ధైర్యం ఉండాలని.. సినిమాల్లో చూసుంటారు కానీ.. నిజ జీవితంలో మాత్రం.. వీరు ధైర్యం చేయలేకపోయారు. ప్రాణాలు తీసుకోవడమే తేలికనుకున్నారు. ఒక ర‌కంగా చెప్పాలంటే ఇంత ఫాస్ట్ జ‌న‌రేష‌న్‌లో కూడా వీళ్ళు ఇలాంటి నిర్ణ‌యం తీసుకున్నారంటే వాళ్ళ పిరికిత‌నం మాములుగా లేద‌నిపిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: