ప్రతి రాజకీయ నాయకుడు దేశాన్ని గొప్పగా నడిపించాలని కలలు కంటాడు.  ఆ కలలకు తగ్గట్టుగా ప్రణాళికలు రూపొందించుకుంటాడు.  అయితే, అనుకున్న వాటిని కొందరే నెరవేర్చుకోగలుగుతారు. అలాంటి వ్యక్తుల్లో ఒకరు ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో ఒకరు.  గతంలో అయన ఫిలిప్పీన్స్ లోని దవయో నగర అధ్యక్షులుగా ఉన్నారు.  ఆ సమయంలో సమయంలో ఆయన ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు.  దీంతో అతన్ని తరువాత ప్రజలు దేశాధ్యక్షుడిగా ప్రజలు ఎన్నుకున్నారు.  


దేశాధ్యక్షుడిగా ఎంపికైన తరువాత దేశంలో డ్రగ్స్ ముఠాపై దృష్టిపెట్టాడు.  దేశంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాలను పట్టుకొని కాల్చివేయాలని పోలీసులకు పిలుపునిచ్చారు.  దీనికి సంబంధించి పోలీసులకు పూర్తి స్వేచ్ఛను ఇవ్వడంతో పోలీసులు తమ ప్రతాపం చూపించారు.  దేశరాజధాని మనీలాలో గతంలో విచ్చలవిడిగా డ్రగ్స్ దొరికేది.  డ్రగ్స్ సరఫరా విరివిగా సాగేది.  కానీ, దేశంలో ఇప్పుడు పరిస్థితులు మారిపోయింది.  


రోడ్రిగో పోలీసులకు ఇచ్చిన ఆదేశాల మేరకు వందలాది మంది డ్రగ్స్ సరఫరా చేసే ముఠాను పోలీసులు మట్టుపెట్టారు.  దొరికిన వాళ్ళను దొరికినట్టుగా కాల్చివేశారు.  దీంతో మనీలా నగరం శవాలతో నిండిపోయింది.  దీంతో అంతర్జాతీయ మానవహక్కుల సంఘం సీరియస్ అయ్యింది. అంతర్జాతీయ న్యాయస్థానంలో కేసు ఫైల్ అయ్యింది.  దీనిపై ఫిలిప్పీన్స్ దేశాధ్యక్షుడు రోడ్రిగో స్పందించాడు.  


ఎలాంటి సమయంలో కూడా హేగ్ న్యాయస్థానంలో సమాధానం చెప్పనని, తాను తన దేశ న్యాయానికి, చట్టానికి మాత్రమే కట్టుబడి ఉంటానని అన్నారు.   అంతర్జాతీయ న్యాయ చట్టాల సభ్యదేశాల జాబితా నుంచి తాము తప్పుకుంటున్నట్టు రోడ్రిగో ప్రకటించారు.  ఇలా తప్పుకోవాలి అంటే దానికి పార్లమెంట్ మద్దతు అవసరం ఉంది.  పార్లమెంట్ మద్దతు తీసుకోకుండా రోడ్రిగో ఇలా చేయడంతో పార్లమెంట్ మద్దతు ఇస్తుందా లేదా అన్నది చూడాలి. తనను ఉరితీసిన, మరణ శిక్ష విధించినా డ్రగ్స్ పై తన పోరు ఆగదని, అంతర్జాతీయ న్యాయస్థానం ముందు నోరు విప్పని అంటున్నాడు రోడ్రిగో.  

మరింత సమాచారం తెలుసుకోండి: