పౌరసత్వం బిల్లుపై దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారు.  అసలు ఈ బిల్లు దేనికోసం ప్రవేశపెట్టారు.  దాని వలన ఎంతవరకు ఉపయోగం ఉన్నది.  ఎవరికి నష్టం ఉన్నది.  ఎవరికి లాభం ఉన్నది అనే విషయాల గురించి ఇప్పుడు దేశంలో నిరసనలు చేస్తున్న ఆందోళనకారుల్లో దాదాపుగా 80 శాతం మందికి పైగా తెలియదు.  తెలియకుండానే ఆందోళన చేస్తున్నారు. ఆందోళన చేస్తున్న నిరసనకారుల్లో ఎంతవరకు ఈ బిల్లు గురించి తెలుసు అనేదానిపై ఇటీవలే జాతీయ మీడియా ప్రశ్నించింది.  


దీనిపై ఆందోళనకారులు చెప్తున్న సమాధానాలు విని షాక్ అయ్యింది.  బిల్లు గురించి వారు చెప్తున్న విషయాలు కొన్ని నవ్వు తెప్పించే విధంగా ఉంటున్నాయి.  బీహార్లో ఈ బిల్లుకు ఆర్జేడీ, జెడియు తదితర పార్టీలు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఆర్జేడీని, లాలు ప్రసాద్ యాదవ్ ను తొక్కేయ్యడానికి ఈ బిల్లు తెస్తున్నారని కొందరు చెప్తున్నారు.  అలానే పౌరసత్వం బిల్లు అన్నది ఒక యంత్రం అని దాని వలన దేశంలోని ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దేశానికి నష్టం వస్తోందని అంటున్నారు.  


ఇలాంటి సమాధానాలు విని జాతీయ మీడియాకు ఎలాంటి ప్రశ్నలు అడగాలో తెలియక షాక్ అవుతున్నది.  అసలు ఈ బిల్లు ముస్లిం దేశాలైన ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన మైనారిటీలకు పౌరసత్వం కలిపించే విషయం మాత్రమే.  దీనికి ఎన్ఆర్సీకి సంబంధం లేదు.  ఇంకా ఎన్ఆర్సీ బిల్లును ప్రవేశపెట్టలేదు.  ఇది మైనారిటీలకు పౌరసత్వం కల్పించేందుకు తీసుకొచ్చిన బిల్లు మాత్రమే అని కేంద్రం చెప్తున్నా దానిని పట్టించుకోకుండా కొన్ని పార్టీలు అనవ్సరంగా ఆందోళన చేస్తున్నాయి.  


దేశంలోని ప్రజల్లో తెలియని భయాన్ని కలిగించేలా చేస్తున్నాయి.  రాజాలను అనవసరంగా ఆందోళనకు గురి చేసేలా చేస్తున్నాయి.  గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా మతపీడనకు గురై ఇండియాకు వచ్చిన హిందువులు, సిక్కులకు కాంగ్రెస్ పార్టీ పౌరసత్వం ఇచ్చింది.  ఇప్పుడు దానిని బిల్లు రూపంలోకి తీసుకొచ్చి కేంద్రం అఫీషియల్ గా చేస్తున్నది.  దీనికి ఎందుకు ఆందోళన చేస్తున్నారో అర్ధం కావడం లేదు.  బిల్లులోని విషయాలను గురించి క్షుణ్ణంగా తెలుసుకోకుండా పార్టీలు రెచ్చగొట్టడంతో ప్రజలు కూడా ఇందులో ఏదో ఉందని వ్యతిరేకిస్తున్నారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: