సమాజంలో రోజు రోజుకు మహిళలపై పెరుగుతున్న అఘాయిత్యాలను చూస్తుంటే.. కొంత కాలం పోతే మహిళలు అంటే ఇలా ఉండేవారా అని పుస్తకాల్లో చదువుకోవలసిన పరిస్దితులు తలెత్తవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఇక నేటికాలంలో ఆడపిల్లలను కనాలంటే ప్రతి వారు భయపడే పరిస్దితులు నెలకొన్నాయి. పసి పిల్లలనుండి పడుచు యువతుల వరకు ముసలి ముతకా అని కూడా చూడకుండా కామాంధులు రెచ్చిపోతున్నారు.

 

 

ఎక్కడా అవకాశం దొరుకుతుందా అని గోతికాడి నక్కలా ఎదురు చూస్తున్నారు. ఆడదంటే అమ్మ అనే పదాన్ని మరచి క్షణకాలంలో శరీరంలో రగిలే సుఖమంటలను ఆర్పే పడతిగా భావిస్తున్నారు. ఇంటిలో గాని, బయటి ప్రపంచంలో గాని, చివరకు స్నానం చేద్దామని వెళ్లిన బాత్రూం లోగాని భయపడుతూ బ్రతక వలసిన పరిస్దితులు తలెత్తుతున్నాయి.. ఇంతలా సమాజంలో అరాచకాలు పెరిగి పోతున్నాయి.. ఆడది కనిపిస్తే చాలు చొంగ కార్చుకుంటూ కుక్కల్లా వెంట పడుతున్నారు. ఇలాగే వారి ఇంట్లో ఉన్న ఆడవారిపట్ల బయటి మగవారు ప్రవర్తిస్తే ఊరుకుంటారా? అనే ఆలోచన కూడా రాకుండా సమాజం అంటే నేనొక్కడినే అనే ధోరణిలో బ్రతుకుతున్నాడు మనిషి అని చెప్పుకునే మృగం..

 

 

ఇకపోతే తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలోని కొత్తపల్లికి చెందిన యువతి స్నానం చేస్తుండగా గ్రామానికి చెందిన దిండి రామ్‌కుమార్‌ అనే యువకుడు సెల్‌ఫోన్‌లో వీడియో తీశాడు.. అది గమనించిన యువతి అతన్ని పట్టుకునే ప్రయత్నం చేయగా ఆ యువకుడు పారిపోగా, సెల్‌ఫోన్‌ మాత్రం చిక్కింది. ఇక ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఆ యువతి వీడియోను చిత్రీకరించిన యువకుడిపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా బాధితురాలి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్‌ఐ తీరు సమాజంలో నిర్లక్ష్యం ఏవిధంగా జడలు విచ్చుకుని వికట్టహసం చేస్తుందో అర్ధం అవుతుంది.

 

 

ఇకపోతే ఎస్‌ఐ తీరుతో మనస్తాపానికి గురైన బాధితురాలు గ్రామపెద్దల సహకారంతో విషయాన్ని ఉన్నతధికారుల దృష్టికి తీసుకెళ్లగా రాముపై కేసు నమోదుచేశారు. ఎస్‌ఐ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా స్టేషన్‌ముందు గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. బాధితురాలు ఎస్‌ఐకు అందజేసిన సెల్‌ఫోన్‌, ఆధారాలను మాయం చేయడమే కాకుండా, నిందితుడికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఈ సందర్భంగా ఆరోపించారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: