ఇన్నాళ్లకు విద్యావ్యవస్దను ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఉంది. అందుకే ఆ దిశగా అడుగులు వేస్తూ సరికొత్త విధానాన్ని ప్రవేశ పెట్టాలని చూస్తుందని సమాచారం.. ఇకపోతే ఉపాధ్యాయుల హాజరు విషయంలో అనేక ప్రైమరీ పాఠశాలల్లో అవకతవకలు జరుగుతున్నట్లు ఇప్పటికే ఆరోపణలున్నాయి. కొందరు టీచర్లు పరస్పర అవగాహనతో వంతుల వారీగా సెలవులు పెడుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఆ టీచర్‌ సెలవులో ఉన్నప్పటికీ హాజరు రిజిస్టర్‌లో మాత్రం సెలవు నమోదు చేయడంలేదు. ఇలా ఎందుకంటే ఇప్పుడు ఉన్న విధానం మ్యాన్యువల్‌గా సంతకం చేసే విధానం కాబట్టి కొందరు టీచర్లు ఆడింది ఆటగా సాగుతుంది.

 

 

అందుకే వీరి విషయంలో శ్రద్ద పెట్టాలని ప్రభుత్వం యోచిస్తుందట. ఇకపోతే ఇప్పటికే  పొరుగు రాష్ట్రం ఏపీలో టీచర్లకు బయోమెట్రిక్ విధానం రెండేళ్ల నుంచి విజయ వంతంగా అమలు చేస్తున్నారు. దీనివల్ల స్కూళ్లకు డుమ్మాలు కొట్టి జీతాలు తన్నుకుపోయే టీచర్ల ఆగడాలకు అడ్డుకట్ట పడింది.. ఇక ఈ విధానాన్ని తెలంగాణ స్కూళ్లలో అమలు చేయాలని తెలంగాణ రాష్ట్రప్రభుత్వం కసరత్తులు మొదలు పెట్టింది. ఇక దీన్ని బట్టి చూస్తే వచ్చే విద్యాసంవత్సరం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉపాధ్యాయులకు తిప్పలు తప్పేలా లేవు. ఎందుకంటే స్కూళ్లలో వారికి కూడా బయోమెట్రిక్ హాజరును అమల్లోకి తీసుకురానున్నారు.

 

 

అయితే, ప్రస్తుతం ఈ విధానం 12 జిల్లాల్లో విద్యార్థులతో పాటు, ఉపాధ్యాయులకు అమలు చేస్తున్నారు. గతంతో పోలిస్తే వీరి అటెండెన్స్ చక్కగా పెరగడంతో ఇదే విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూళ్లలో వాడాలని ఉన్నతాధికారులు ప్రణాళికలు వేస్తున్నారు. ఇక ఈ విధానాన్ని 2020-21 విద్యా సంవత్సరం నుంచి అమలు పరచాలని ఆలోచనలో ఉన్నారట. కానీ ఒకేసారి అంత పెద్ద మొత్తంలో బయోమెట్రిక్‌ యంత్రాలు సమకూర్చడం కూడా అంత సులభం కాదు కాబట్టి కొత్త ప్రణాళిక వేశారు.

 

 

అదేమంటే ఇప్పుడు 12 జిల్లాల్లో  విద్యార్థుల కోసం ఏర్పరచిన బయోమెట్రిక్‌నుకు తొలగించి, ఆ మిషన్లను రాష్ట్ర వ్యాప్తంగా టీచర్ల కోసం వాడాలని భావిస్తున్నారు. తర్వాత నెమ్మదిగా విద్యార్థులకూ అందుబాటులోకి తీసుకొస్తారు. దీనిపై త్వరలో అధికారులు సమావేశమై చర్చించనున్నారు. ఇకపోతే రాష్ట్రంలో సమారు 26 వేల ప్రభుత్వ, పంచాయతీరాజ్‌ పాఠశాలలు ఉన్న సంగతి తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: