దేశంలో పౌరసత్వంపై నిరసనలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే.  పౌరసత్వం బిల్లును కేంద్రం వెనక్కి తీసుకోవాలని కొన్ని రాజకీయ పార్టీలు ఆందోళన చేస్తున్నాయి.  ముస్లింలకు అన్యాయం జరుగుతుందని, ముస్లింలు ఆందోళన చేయాలని వారిని రెచ్చగొడుతున్నాయి.  వెస్ట్ బెంగాల్ ఈ ఆందోళనకు ఆజ్యం పోసింది.  స్వయంగా ముఖ్యమంత్రి ఈ ఆందోళన చేపట్టడంతో ఇందులో ఏదో ఉందని, ఏదో జరగబోతుందని ఆందోళన చెందుతున్నాయి.  


అయితే, ఈ ఆందోళనలో ఎలాంటి ఇబ్బందులు లేవని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఉండబోవని కేంద్రం చెప్తున్నది.  ప్రస్తుతం కేవలం పౌరసత్వం సవరణ బిల్లు మాత్రమే ఆమోదం జరిగిందని, ఇంకా ఎన్ఆర్సి బిల్లు తీసుకురాలేదని, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన మైనారిటీలను పరిశీలించి వారికీ పౌరసత్వం కల్పించడమే ఈ బిల్లు లక్ష్యం.  అంతకు మించి మరొకటి కాదు.  ఈ బిల్లును కొన్ని పార్టీలు వక్రీకరించి తమకు అనుకూలంగా మార్చుకోవానికి ప్రయత్నం చేస్తున్నాయి.  


ఈ బిల్లుకు షియా ముస్లింలు మద్దతు ఇస్తున్నాయి.  బిల్లును అనవసరంగా కొన్ని పార్టీలు తప్పు పట్టిస్తున్నాయని షియా ముస్లింలు అంటున్నారు.  షియా ముస్లింల మత గురువు, మజ్లిస్-ఏ-ఉలామా-ఏ-హింద్ ప్రధాన కార్యదర్శి మౌలానా కాల్బే జావాద్ ఈ బిల్లుపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంటున్నారు.  కొన్ని పార్టీలు తమ రాజకీయ మనుగడ కోసమే ఆందోళన చేస్తున్నాయని, బిల్లు గురించి పూర్తిగా తెలుసుకోకుండా అనవసరంగా దేశంలో అలజడులు సృష్టిస్తున్నాయని అన్నారు.  


పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర రిజిస్టర్  రెండూ పూర్తిగా ఒకదానికొకటి సంబంధలేని వేర్వేరు అంశాలని చెప్పారు. రాజకీయ పార్టీలు వాటి స్వార్థ ప్రయోజనాల కోసం ముస్లింలు, యువతను కావాలని మిస్‌లీడ్ చేస్తున్నాయన్నారు. దయచేసి ముస్లింలు ఎటువంటి హింసకు పాల్పడకుండా సంయమనం పాటించాలని పిలుపునిచ్చారాయన. ప్రస్తుతానికి ఎన్ఆర్సిని అస్సాంలో మాత్రమే అమలు చేస్తున్నారని, దేశమంతా దీన్ని తీసుకుని రాలేదని చెప్పారు. ఒకవేళ దేశమంతా తీసుకొస్తే ఎటువంటి రూల్స్, కండిషన్ ఉంటాయన్నది ఇంకా స్పష్టత లేదని అన్నారు. అనవసరంగా పొలిటికల్ పార్టీలు జనాల్లో కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నాయని ఆయన ఆరోపించారు.  షియా ముస్లింలు బిల్లుకు మద్దతు ఇవ్వడంతో ప్రతిపక్ష పార్టీలు షాక్ అవుతున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: