ఇప్పుడు ఎక్కడ చూసినా...జగన్ అసెంబ్లీ సమావేశాల చివరి రోజు మాట్లాడిన  ఏపీకి మూడు రాజధానుల మాటే  గట్టిగ వినిపిస్తోంది.ఆ విషయం గురించే  చర్చలూ జరుగుతున్నాయి . మొత్తంగా  మూడు రాజధానుల మాట విషయం లో పది ... నిన్నటి దాకా రాష్ట్రంలో పెద్ద సమస్యలుగా పరిగణించిన ఇంగ్లీష్ మీడియం - అన్యమత ప్రచారం తదితర సమస్యల  గురించి ఎవరు చర్చ చేయట్లేదు ప్రస్తుతం . ఇప్పుడంతా రాజధానిపైనే చర్చ.

 

అందులోను ఎక్కువగా  విశాఖ కేంద్రంగా ఏర్పాటు కానున్న ఎగ్జిక్యూటివ్ కేపిటల్ పైనే చర్చ. ఇలాంటి సమయం లో  విశాఖలోవచ్చే  ఎగ్జిక్యూటివ్ కేపిటల్ వల్ల జరిగే మార్పుల గురించి వైసీపీ ప్రధాన కార్యదర్శి  ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి మాట్లాడిన మాటలు  మరింత ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఎన్నికలకు ముందు టీడీపీకి  ఆ పార్టీ వాళ్ళ వచ్చిన  ఎంపీ పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరాడు అవంతి శ్రీనివాస్ భీమిలి  నియోజకవర్గం నుంచి బంపర్ విక్టరీ కొట్టి ఏకంగా జగన్ కేబినెట్ లో కీలక మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు ఈ విషయం విన్న అవంతి  శ్రీనివాస్ కు మరింతగా సంతోషాన్నిచ్చాయనే చెప్పాలి.

 

భీమిలిలో పర్యటిస్తున్న సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో పాలు పంచుకున్న విజయసాయిరెడ్డి.. విశాఖలో ఎగ్జిక్యూటివ్ రాజధాని వల్ల ఆ ప్రాంతానికి కలిగే లాభాలపై  చాలా క్లారిటీగానే వివరించారు . విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ తో భీమిలి రూపురేఖలు మారిపోనున్నాయి అనిసాయిరెడ్డి చెప్పారు. ఎగ్జిక్యూటివ్ కేపిటల్ తో భీమిలి సాధారణ పట్టణం స్థాయి నుంచి మహా పట్టణం స్థాయికి మారిపోతుందని కూడా సాయిరెడ్డి చెప్పుకొచ్చారు.

 

అంతేకాకుండా విశాఖలో ఏర్పాటయ్యే ఎగ్జిక్యూటివ్ కేపిటల్ భీమిలి కేంద్రంగానే ఏర్పాటు కానుందని కూడా సాయిరెడ్డి తెలిపారు.  మంత్రి అవంతి శ్రీనివాస్ - సత్యనారాయణ మూర్తి నేతృత్వంలో భీమిలిలో రాజధాని ఏర్పాటు కానుండటం సంతోషంగా ఉందని కూడా సాయిరెడ్డి ఆసక్తికర మాటలు మాట్లాడారు సాయిరెడ్డి మాటలతో సదరు సమావేశంలో పాలుపంచుకున్న అవంతి శ్రీనివాస్ తో పాటు ఎంపీ సత్యనారాయణ మూర్తి కూడా అనడంతో మునిగిపోయారు అని తెలుస్తుంది . 

మరింత సమాచారం తెలుసుకోండి: