ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జనవరి 2వ తారీఖున రాజధాని విషయమై అన్ని పార్టీలతో ఒక ముఖ్యమైన మీటింగ్ లో చర్చించనున్నారని సమాచారం. ఆ మీటింగ్ నిర్వహించే ముందు ఈ నెల 27వ తేదీన కేబినెట్ సమావేశంలో దీని గురించి చర్చించనున్నారు. 2014 డిసెంబర్ లో... అనగా సరిగ్గా ఐదేళ్ల క్రితం చంద్రబాబు అమరావతిని రాజధానిగా ప్రకటించినప్పటినుంచి ఏ ఒక్క రోజు కూడా ఇటువంటి చర్చను నిర్వహించలేదు. ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రానికి రాజధాని వ్యవస్థాపన వంటి పెద్ద విషయం పై అతను ఏ రోజు ప్రతిపక్షాల సలహాలు తీసుకోలేదు సరికదా వారిపై అసలు తనకు నమ్మకం లేదు అన్నట్టు వ్యవహరించారు.

 

కానీ ఈసారి జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఒక ఎక్స్పర్ట్ కమిటీని నిర్వహించి వారి అందరి సలహాలు సూచనలు తీసుకున్న తర్వాత కూడా ప్రతిపక్షాలతో కూడా కలిసి ఒక భేటీ నిర్వహించి వారందరితో కలిసి చర్చించి ఒక నిర్ణయాత్మకమైన పద్ధతిలో ముందుకు పోనున్నారు. ఇప్పుడు ఉన్న సమాచారం ప్రకారం ముఖ్యమంత్రి ప్రతిపక్షాలలోని నాయకులను ఒప్పించిన తర్వాతే రాజధాని విషయంలో ముందుకు పోనున్నారని సమాచారం. అయితే ఇక్కడ ప్రతిపక్షాలు జగన్ తీసుకునే నిర్ణయంపై ఎలా స్పందిస్తారు మరియు వారి వైఖరి ఎలా ఉంటుందనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

 

ప్రస్తుతానికైతే తెలుగుదేశం పార్టీ, జనసేన మరియు సిపిఐ జగన్ తీసుకున్న 3 రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉండగా భారతీయ జనతా పార్టీ మాత్రం జగన్ నిర్ణయాన్ని సమ్మతించింది. ఇక సిపిఎం ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉండగా కాంగ్రెస్ పార్టీకి అసలు సరైన నిర్దేశకత్వం లేక వారు ఎటువైపు ఉండాలో కూడా తెలియక సతమతమవుతున్నారు. మునుపు చంద్రబాబు ప్రతిపక్షాలను కనీసం వెలగపూడి రోడ్ల మీదకు కూడా అనుమతించకపోవడం... జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రత్యేకంగా వారితో సమావేశమై రాజధాని విషయం పై ఒక కీలక నిర్ణయం తీసుకొనుండడంతో ప్రజలంతా ఆయన ఇప్పటికే ఒక మెట్టు ఎక్కేశారని అని కొనియాడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: