ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ అవసరమని దీని కోసం రాష్ట్రంలో మూడు రాజధానులు వచ్చే అవకాశం ఉందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై విపక్ష పార్టీల నుండే  కాకుండా అమరావతి రైతుల నుంచి ఆగ్రహజ్వాలలు వ్యక్తమవుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న 3 రాజధానిల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రిలే నిరాహారదీక్షలు చేపడుతున్నారు అమరావతి రైతులు. అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన 3 రాజధానిల ప్రకటనపై తన అభిప్రాయాలను తెలిపారు సినీనటుడు జనసేన నేత నాగబాబు. దీనికి సంబంధించి తన అభిప్రాయాలను తెలుపుతూ తన యూట్యూబ్ ఛానల్లో ఓ  వీడియో విడుదల చేశారు. 

 

 

 రాజధాని అమరావతి భూములు ఇచ్చిన రైతులకు జరిగిన అన్యాయాన్ని మొత్తం తాను కళ్లారా చూశానని నాకు బాబు తెలిపారు. నాదెండ్ల మనోహర్ తో కలిసి తాము మందడం  వెళ్ళామని... అక్కడ రైతుల బాధలను తెలుసుకున్నామంటూ  నాగబాబు వీడియోలో  చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం భూములు ఇచ్చిన ఆ రైతులే ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని నాగబాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో అమరావతిలో సేకరించిన మొత్తం భూమి 34, 322 ఎకరాల అని నాగబాబు తెలిపారు. అమరావతి నిర్మాణం కోసం 29,881 మంది రైతులు  భూములు ఇచ్చారని తెలిపారు నాగబాబు. 

 

 

 అమరావతి విస్తీర్ణం 34,322 ఎకరాల్లో  ఉంటే  కేవలం ఐదు వేల ఎకరాల్లో అవకతవకలు జరిగాయని ప్రస్తుత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆరోపిస్తున్నారని ఆయన అన్నారు. అది వాస్తవంగా జరిగి ఉండొచ్చని నాగబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. అమరావతి లో ఐదు వేల ఎకరాలు అవకతవకలు  జరిగాయని ఆరోపిస్తూన్న  వైసీపీ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.కాగా మన దేశంలో  దేశంలో కుహనా లౌకిక ఉదారవాదుల వల్ల దేశంలో చాలా నష్టం జరిగిందని జరుగుతుందని జరగబోతుందని వీడియో లో తెలిపారు నాగబాబు . ప్రస్తుతం నాగబాబు పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: