పౌరసత్వ సవరణ చట్టంపై విపక్షాలు తప్పుడు ప్రచారం జరుపుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్రమోడీ మండిపడ్డారు. కనీసం చట్టాలు ఏమి అని తెలియకుండా ప్రతిపక్షాలు ప్రజలను రెచ్చగొడతున్నాయని ఆయన విమర్శించారు. అబద్దాలను ప్రచారం చేసేవారిని ప్రజలు రెచ్చగొడుతున్నారని అయన అన్నారు. ఈ నేపథ్యంలోనే అనేక వర్గాల ప్రజలు ఎన్నుకున్న పార్లమెంట్ చట్టాన్ని అమోదించిందని, పార్లమెంట్ చట్టాలను గౌరవించాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని మోడీ ఢిల్లీ సభలో చెప్పుకొచ్చారు. 

 

ఈ నేపథ్యంలోనే పార్లమెంట్‌కు గౌరవం ఇచ్చే విధంగా అందరూ ఒకే తాటిపై ఉండాలని ప్రజలకు కోరారు. మరోవైపు కులాలు, మతాలు చూడకుండా అభిృవృద్ది కార్యక్రమాలు చేపడుతున్నామని మోడీ చెప్పారు. ఇందులో భాగంగానే ఢిల్లీలోని 40 లక్షల మంది లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు ఇచ్చి రెగ్యులరైజ్ చేశామని అయన అన్నారు. కుల,మతాలకు అనుగుణంగా పథకాలు ఢిల్లీలోని రాంలీలా మైదానంలో చేపట్టిన భారీ ర్యాలీ, బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గోని ప్రసగించారు. 

 

ఈ సంధర్భంగా భారీ బందోబస్తు మధ్య వేల మంది బీజేపీ సభకు హజరయ్యారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ పరిస్థితులు, బీజేపీ ప్రవేశపెట్టిన పథకాలను మోడీ తెలిపారు. ఢిల్లీలో ప్రజలకు పట్టాలు ఇవ్వడం తోపాటు మౌలిక వసతులపై ఆయన ప్రజలకు వివరించారు. అయితే ఈ నేపథ్యంలోనే బడుగు బలహీన వర్గాల ప్రజల నుండి ఎన్నికైన మొత్తం పార్లమెంట్ సభ్యులు పౌరసత్వ సవరణ బిల్లుకు మద్దతు పలికారని, వారి నిర్ణయాన్ని గౌరవించడం ప్రజల బాధ్యత అని పేర్కొన్నారు. అయితే కొంత మంది పౌరసత్వ చట్టంపై రూమర్స్ సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు. 

 

ఎవరికైనా కోపం ఉంటే నాపై తీర్చుకొండి మోడిపై కోపం ఉంటే తీర్చుకొండి, కాని బడుగు బలహీన వర్గాలు, రోజువారి కూలి చేసుకునే ప్రజలపై దాడులు చేయవద్దని అయన అన్నారు. మోడీ దిష్టిబొమ్మలు కాల్చండి కానీ, ప్రజల ఆస్తులను తగులబెట్టవద్దు ప్రధాని ఈ సందర్బంగా కోరారు. ఇక ఆందోళనల్లో భాగంగా పోలీసులపై దాడులు చేయడంపై ఆయన అభ్యంతరం వ్యక్త పరిచారు. ప్రజల రక్షణకు అహర్నిషలు కృషి చేసే పోలీసులపై దాడులు చేస్తున్నారని అన్నారు. దేశంలోని లక్షల మంది పోలీసులు కులమతాలు చూసుకోకుండా తమ ప్రాణాలను పెట్టి ప్రజలకు రక్షణగా నిలుస్తున్నారని అయితే వారిపై కూడ దాడులు చేయడం చాల దురదృష్టకరమని ప్రధాని అన్నారు. 

 

ఇదంతా ఇలా ఉండగా మోడీ ఢిల్లీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఆప్ ప్రభుత్వానికి దూరదృష్టి లేదని అన్నారు. సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ కు తాగునీటి సమస్యను ఎలా పరిష్కరించాలో అర్థం కాలేదని అన్నారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ ప్రభుత్వం అనేక అబద్దాల హామీలు ఇచ్చిందని మోడీ విమర్శించారు. స్వాతంత్రం వచ్చి డెబ్భై ఎళ్లు గడుస్తున్నా, ఢిల్లీ ప్రజలు భయం, తప్పుడు హమీల మధ్య జీవిస్తున్నారని అయన అన్నారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ కాలనీ ప్రజలు అక్రమ నిర్మాణాల పేరుతో కూల్చివేతలు చేస్తున్నారని అన్నారు. అందుకే మొత్తం 1700 కాలనీల్లో ఉన్న సుమారు 40 మంది లబ్దిదారుకు ఇళ్ల పట్టాలు ఇచ్చామని అయన చెప్పారు. ఇందులో ఎలాంటీ కులమతాలు చూడలేదని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: